హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung: గెలాక్సీ S23 అల్ట్రా, గెలాక్సీ S23 ప్లస్‌, గెలాక్సీ 23 లాంచ్‌ చేసిన శామ్‌సంగ్‌.. వీటి ఫీచర్స్‌ మధ్య తేడాలు ఇవే

Samsung: గెలాక్సీ S23 అల్ట్రా, గెలాక్సీ S23 ప్లస్‌, గెలాక్సీ 23 లాంచ్‌ చేసిన శామ్‌సంగ్‌.. వీటి ఫీచర్స్‌ మధ్య తేడాలు ఇవే

Samsung: గెలాక్సీ S23 అల్ట్రా, గెలాక్సీ S23 ప్లస్‌, గెలాక్సీ 23 లాంచ్‌ చేసిన శామ్‌సంగ్‌..

Samsung: గెలాక్సీ S23 అల్ట్రా, గెలాక్సీ S23 ప్లస్‌, గెలాక్సీ 23 లాంచ్‌ చేసిన శామ్‌సంగ్‌..

Samsung: కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ కంపెనీ ఆండ్రాయిడ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ అందించింది. ఆండ్రాయిడ్‌ యూజర్లు భారీ అంచనాలు పెట్టుకున్న గెలాక్సీ S23 సిరీస్‌ను లాంచ్‌ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ (Samsung) కంపెనీ ఆండ్రాయిడ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ అందించింది. ఆండ్రాయిడ్‌ యూజర్లు భారీ అంచనాలు పెట్టుకున్న గెలాక్సీ S23 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఇండియాలో గతేడాది శామ్‌సంగ్‌ గెలాక్సీ S22 సిరీస్ లాంచ్‌ చేసింది. బుధవారం గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2023 ఈవెంట్‌లో ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S23 అల్ట్రా, గెలాక్సీ S23+, గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి టాప్-ఎండ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను అందిస్తున్నాయి. శామ్‌సంగ్‌ కొత్త సిరీస్‌లోని మొబైల్స్‌ స్పెషిఫికేషన్‌ల మధ్య తేడా ఏంటనే వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

* గెలాక్సీ S23 ప్లస్ స్పెసిఫికేషన్‌లు

ఈ మొబైల్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 చిప్‌సెట్‌తో రన్‌ అవుతుంది. 6.6-అంగుళాల డైనమిక్ AMOLED 2X ప్యానెల్‌తో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ (48~120Hz), గేమ్ మోడ్‌లో 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 13- బేస్డ్‌ OneUI 5.1 సాఫ్ట్‌వేర్‌తో పని చేస్తుంది. 4,700mAh బ్యాటరీని అందిస్తోంది.

S23 ప్లస్ రెండు 8GB+512GB, 8GB+256GB స్టోరేజ్, మెమరీ ఆప్షన్‌లలో లభిస్తుంది. S23 ప్లస్ 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50 MP వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. వీడియో కాల్‌లు, సెల్ఫీల కోసం F2.2 ఎపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ డివైజ్‌కు IP68 రేటింగ్ కూడా ఉంది. అంటే 30 నిమిషాల పాటు డస్ట్‌, 1.5 మీటర్ల నీటిలో సురక్షితంగా ఉంటుంది.

* గెలాక్సీ S23 స్పెసిఫికేషన్‌లు

గెలాక్సీ S23 ఫోన్‌ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ (48~120Hz), 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.1-అంగుళాల డైనమిక్ AMOLED 2X ప్యానెల్‌ను అందిస్తుంది. 8GB RAMతో 128GB, 256G, 512GB స్టోరేజ్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 3,900mAh బ్యాటరీ ఉంటుంది.

క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 చిప్‌సెట్‌తో రన్‌ అవుతుంది. ఆండ్రాయిడ్ 13-బేస్డ్‌ OneUI 5.1 సాఫ్ట్‌వేర్‌తో పని చేస్తుంది. USB టైప్-C పోర్ట్, SIM ట్రే, ఫైరింగ్ స్పీకర్ ఉన్నాయి. కెమెరాల పరంగా S23, S23 ప్లస్ ఒకే విధంగా ఉన్నాయి. వెనుక వైపు 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. F2.2 ఎపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.

* శామ్‌సంగ్‌ గెలాక్సీ S23 అల్ట్రా స్పెసిఫికేషన్‌లు

శామ్‌సంగ్‌ కంపెనీ కర్వ్‌డ్‌ ఎడ్జెస్‌ను తొలగించింది. ఈ ఫోన్‌ స్ట్రైట్‌గా ఉంటుంది. ఫాంటమ్ బ్లాక్, లావెండర్, క్రీమ్, గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ టాప్-ఎండ్ వేరియంట్ 12GB + 1TB, 12GB+ 512GB, 12GB + 256GB, 8GB + 256GB వంటి నాలుగు స్టోరేజ్‌, మెమరీ ఆప్షన్‌లతో వస్తుంది. S23 అల్ట్రా 6.8-అంగుళాల QHD+ AMOLED ప్యానెల్‌, 120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ అందిస్తుంది. విజన్ బూస్టర్, మెరుగైన కంఫర్ట్ మోడ్ ఉన్నాయి.

స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ అందిస్తుంది. ఈ ఫోన్‌ క్వాడ్ కెమెరా సెటప్‌లో 200MP వైడ్ కెమెరా, 10MP 3X టెలిఫోటో కెమెరా, 10MP 10X టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. S23 అల్ట్రా AI సూపర్ రిజల్యూషన్ టెక్నాలజీతో 100X స్పేస్ జూమ్, 10x ఆప్టికల్ జూమ్, 10x డిజిటల్ జూమ్‌లను కూడా అందిస్తుంది. ఫాస్ట్‌ ఆటోఫోకస్, 60fps వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో సూపర్ HDR సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది కూడా చదవండి : Fire Boltt Cobra: అడ్వెంచర్ లవర్స్‌ కోసం సూపర్ వాచ్.. యాపిల్ వాచ్ కి ధీటుగా ‘ఫైర్‌బోల్ట్ కోబ్రా’..

ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. Galaxy S22 సిరీస్‌తో పోలిస్తే ప్రాసెసింగ్ సామర్థ్యం 30 శాతం పెరిగింది. డివైజ్‌ Android 13-బేస్డ్‌ OneUI 5.1 సాఫ్ట్‌వేర్‌తో రన్‌ అవుతుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్‌తో 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను అందిస్తుంది. అదనంగా ఇందులో బ్లూటూత్ S-పెన్‌ ఉంటుంది. ఇది Galaxy S22 అల్ట్రాతో Galaxy S సిరీస్‌లో మొదటిసారిగా ఇంట్రడ్యూస్‌ అయింది. అదే విధంగా USB టైప్-C పోర్ట్, S-పెన్ స్లాట్, SIM ట్రే, బాటమ్-ఫైరింగ్ స్పీకర్ ఉన్నాయి.

* గెలాక్సీ S23 అల్ట్రా, గెలాక్సీ S23 ప్లస్, గెలాక్సీ 23 మధ్య వ్యత్సాసం

ఆండ్రాయిడ్ వినియోగదారులు కొత్తగా లాంచ్‌ చేసిన Samsung Galaxy S23 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్కువ అంచనాలతో ఉన్నారు. మూడు స్మార్ట్‌ఫోన్‌లు అప్‌గ్రేడ్ చేసిన కెమెరా, బ్యాటరీ, స్పెసిఫికేషన్‌లతో వస్తాయి. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 చిప్‌సెట్‌తో శక్తివంతమైన పనితీరును అందిస్తాయి.

First published:

Tags: New smartphone, Samsung, Samsung Galaxy, Tech news

ఉత్తమ కథలు