Galaxy S23 Ultra| దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా తీపికబురు అందించింది. తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ (Smartphone) గెలాక్సీ ఎస్23 అమ్మకాలను ప్రారంభించినట్లు వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్‌లో గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్ ప్రిబుకింగ్స్‌ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు ముందుగానే ఈ ఫోన్‌ను (Phone) బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్పెషల్ ఆఫర్లు కూడా సొంతం చేసుకోవచ్చు.
యూజర్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌ను టోకెన్ అమౌంట్ ఇచ్చి బుక్ చేసుకోవచ్చు. కేవలం రూ. 1,999 చెల్లిస్తే చాలు. ప్రిబుక్ చేసుకోవచ్చు. శాంసంగ్ వెబ్‌సైట్ల్‌లోకి స్మార్ట్‌ఫోన్‌ను ముందుగానే బుక్ చేయొచ్చు. కేవలం కంపెనీ వెబ్‌సైట్ నుంచి మాత్రమే కాకుండా శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, అమెజాన్ ఇండియా, రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కూడా మీరు ఈ ఫోన్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది.
అబ్బా.. ఆఫర్ అంటే ఇది.. రూ.33,000 టీవీ రూ.6,999కే!
ఎవరైతే ఇలా ఫోన్ లాంచ్ కన్నా ముందుగానే ప్రిబుక్ చేసుకుంటే.. వారికి ముందుగా స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా కస్టమర్లకు రూ. 5 వేల వకు బెనిఫిట్ లభిస్తుంది. శాంసంగ్ కంపెనీ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 1న మార్కెట్‌లో ఆవిష్కరించబోతోంది.
రూ.1తో ఒక కిలోమీటర్ వెళ్లొచ్చు.. హైడ్రోజన్ కారు అదరహో!
వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉండనుంది. ఇంకా హైఎండ్ మోడల్‌లో 200 ఎంపీ కెమెరా ఉండొచ్చని తెలుస్తోంది. 12 జీబీ ర్యామ్ ఉండొచ్చు. హైఎండ్ మోడల్ పేరు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాగా ఉండే అవకాశం ఉంది. అంటే కంపెనీ మోటరోలా, షావోమి వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ నాలుగు కలర్లలో లభ్యం కావొచ్చు. బ్లాక్, గ్రీన్, పింక్, లేత గోధుమ రంగుల్లో అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది.
ఇంకా గెలాక్సీ ఎస్23 ప్రో అనే మరో వేరియంట్ కూడా ఉండొచ్చు. అంటే కంపెనీ ఒకేసారి గెలాక్సీ ఎస్23 సిరీస్‌లో మూడు ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్లలో 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే రెగ్యులర్ మోడల్‌లో 25 వాట్ చార్జింగ్ స్పీడ్ ఉండొచ్చు. ఇక ఇతర రెండు మోడళ్లలో 45 వాట్ చార్జింగ్ స్పీడ్ ఉండే అవకాశం ఉంది. ఇకపోతే గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్స్ ధర ఎంత ఉండొచ్చొ తెలియదు. అయితే వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. గెలాక్సీ ఎస్23 సిరీస్ రేటు రూ. 75,999 నుంచి ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. బేస్ మోడల్‌లో 256 జీబీ మెమరీ ఉండొచ్చని తెలుస్తోంది. అందువల్ల ఇతర మోడళ్ల రేటు ఇంకా పెరగొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g phones, 5G Smartphone, Samsung, Samsung Galaxy