హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung Galaxy S23: గెలాక్సీ S23పై బంపరాఫర్.. అమెజాన్ స్పెషల్‌ డీల్‌ వివరాలు ఇవే

Samsung Galaxy S23: గెలాక్సీ S23పై బంపరాఫర్.. అమెజాన్ స్పెషల్‌ డీల్‌ వివరాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో హై-ఎండ్ ఫీచర్స్‌తో గెలాక్సీ S23 సిరీస్‌ను ప్రపంచ‌వ్యాప్తంగా శామ్‌సంగ్ లాంచ్ చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ S23 సిరీస్  ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్ అండ్ లాంవెండర్‌ వంటి మూడు కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

స్మార్ట్‌ఫోన్ టాప్ బ్రాండ్స్‌లో శామ్‌సంగ్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్‌లో ఈ బ్రాండ్‌కు మంచి డిమాండ్ ఉంది. దాదాపు అన్ని సెగ్మెంట్లలో స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తూ మార్కెట్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటోంది. ఇటీవల ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో హై-ఎండ్ ఫీచర్స్‌తో గెలాక్సీ S23 సిరీస్‌ను ప్రపంచ‌వ్యాప్తంగా శామ్‌సంగ్ లాంచ్ చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్ అండ్ లాంవెండర్‌ వంటి మూడు కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. గెలాక్సీ S23 లైనప్‌లో అత్యంత చౌకైన మోడల్‌పై అమెజాన్ భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

బేస్ మోడల్‌‌పై రూ.13,000 డిస్కౌంట్

ఈ సిరీస్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S23, గెలాక్సీ S23 ప్లస్, గెలాక్సీ S23 అల్ట్రా అనే పేర్లతో మూడు స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే శామ్‌సంగ్... S23 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రీ-బుకింగ్ ప్రారంభించింది. ఫిబ్రవరి 23 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రీ-బుకింగ్ సందర్భంగా కంపెనీ కొన్ని ఆఫర్లను ప్రకటించింది. గెలాక్సీ S23 లైనప్‌లో బేస్‌ మోడల్‌పై అమెజాన్ రూ.13,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో బ్యాంకు ఆఫర్స్ కూడా కలిసి ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం

ఆఫర్స్ పూర్తి వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ S23 128GB వేరియంట్ ధర 74,999 కాగా, 256GB వేరియంట్ ధర రూ.79,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే అమెజాన్‌లో పరిమిత సేల్ ఆఫర్‌లో భాగంగా 128GB వేరియంట్ ధరతో 256GB వేరియంట్‌ను పొందవచ్చు. అంటే Galaxy S23 256GB వేరియంట్‌పై రూ. 5000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్‌‌పై కొనుగోలు చేస్తే అదనంగా రూ. 8,000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫైనల్‌గా శామ్‌సంగ్ గెలాక్సీ‌S23ను రూ.66,999కు సొంతం చేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ S23 స్మా్ర్ట్‌ఫోన్ 2340x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇది క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. గెలాక్సీ S23 సిరీస్‌లో 8GB RAM + 128GB, 8GB RAM + 256GB, 8GB RAM + 512GB అనే మూడు స్టోరేజ్ వేరియంట్స్ ఉంటాయి. గెలాక్సీ S23 UI 5.1 స్కిప్‌తో Android 13పై రన్ అవుతుంది.

50 MP ప్రైమరీ కెమెరా, 3900mAh బ్యాటరీ

శామ్‌సంగ్ గెలాక్సీS23లో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 MP ప్రైమరీ లెన్స్‌, 12 MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10 MP టెలిఫోటో లెన్స్‌ కెమెరా ఉంటుంది. శామ్‌సంగ్ S23లో 3900mAh బ్యాటరీ ఉంటే, S23 ప్లస్‌లో 4700mAh బ్యాటరీ ఉంటుంది.

First published:

Tags: Samsung Galaxy, Smartphone