Home /News /technology /

SAMSUNG GALAXY S22 ULTRA THIS IS THE HIGHEST SELLING ANDROID SMART PHONE OF THE YEAR WHAT IS ITS FEATURES GH SK

Samsung Galaxy S22 Ultra: ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్ ఇదే.. ఎందుకంత డిమాండ్? ప్రత్యేకతలేంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Samsung Galaxy S22 Ultra: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో టాప్ బ్రాండ్స్‌లో ఒకటిగా నిలుస్తోంది టెక్ దిగ్గజం శామ్‌సంగ్ (Samsung). అయితే 2022 మొదటి అర్ధభాగంలో ఈ సెగ్మెంట్‌లో శామ్‌సంగ్ మిక్స్‌డ్ రిజల్ట్స్ నమోదు చేసింది.

Galaxy S22 Ultra:  ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో టాప్ బ్రాండ్స్‌లో ఒకటిగా నిలుస్తోంది టెక్ దిగ్గజం శామ్‌సంగ్ (Samsung). అయితే 2022 మొదటి అర్ధభాగంలో ఈ సెగ్మెంట్‌లో శామ్‌సంగ్ మిక్స్‌డ్ రిజల్ట్స్ నమోదు చేసింది. ఈ కాలవ్యవధికి సంబంధించి కంపెనీకి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నాయి. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ మార్కెట్ పల్స్ సర్వీస్ ప్రకారం, ప్రీమియం సెగ్మెంట్‌లో కంపెనీ షేర్ తగ్గిపోయినప్పటికీ, గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా (Samsung Galaxy S22 Ultra) ఫోన్ మాత్రం ఈ విభాగంలో మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. గెలాక్సీ S22 అల్ట్రా ఫోన్‌ను శామ్‌సంగ్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. గెలాక్సీ S22 సిరీస్‌లో ఇది టాప్-ఎండ్ డివైజ్‌గా రిలీజ్ అయింది. ఇండియాలో దీని ధర రూ. 109,999గా ఉంది. మన దేశంలో ఈ ఫోన్ సేల్స్ 2022 మార్చిలో ప్రారంభమయ్యాయి.

అబ్బా.. ఐఫోన్ అదిరిపోయే ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.3,599కే సొంతం.. ఇంకెందుకు ఆలస్యం

కౌంటర్ పాయింట్ రిసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, శామ్‌సంగ్ (Samsung Phones)ప్రీమియం విభాగంలో మార్కెట్ వాటా కోల్పోయింది. కంపెనీ 2021లో S21 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. అయితే ఆ తర్వాత గెలాక్సీ S22 సిరీస్‌ను ఆలస్యంగా లాంచ్ చేయడం వల్ల, ఆ ప్రభావం మార్కెట్ షేర్‌పై పడింది. మొత్తానికి గెలాక్సీ S22 సిరీస్ మంచి పనితీరు కనబరుస్తోందని నివేదిక పేర్కొంది.



* రికార్డు దిశగా సేల్స్
గెలాక్సీ S సిరీస్, నోట్ సిరీస్‌లలో అందించిన బెస్ట్ ఫీచర్లను కలిపి కంపెనీ గెలాక్సీ S22 అల్ట్రా ఫోన్‌ను తయారు చేసింది. శామ్‌సంగ్ 2021లో నోట్ సిరీస్‌ ప్రొడక్షన్ ఆపేసింది. దీంతో గెలాక్సీ నోట్ సిరీస్‌లో అత్యంత ఆదరణ పొందిన ఫీచర్ అయిన S-పెన్‌ను Galaxy S లైనప్‌కి తీసుకువచ్చింది. సేల్స్ పెంచుకునేందుకు శామ్‌సంగ్ ఈ స్ట్రాటజీతో వచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ప్రకారం.. శామ్‌సంగ్ ఈ సంవత్సరం 10.9 మిలియన్ యూనిట్ల గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా ఫోన్లను విక్రయించే అవకాశం ఉంది. గెలాక్సీ S22 అల్ట్రా ఫోన్ ఈ అంచనాలను చేరుకోగలిగితే, లాంచ్ అయిన మొదటి సంవత్సరంలో రికార్డ్ సేల్స్ నమోదు చేస్తుంది. అమ్మకాల పరంగా ఇది గత నాలుగు తరాల గెలాక్సీ నోట్ స్మార్ట్‌ఫోన్‌లను అధిగమించగలదు.

Suzuki Katana: స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. సుజుకి సూపర్ బైక్ లాంచ్.. ధరెంతో తెలుసా..?

గెలాక్సీ నోట్ 8 లాంచ్ అయిన మొదటి సంవత్సరంలో శామ్‌సంగ్ 10.3 మిలియన్ యూనిట్లను విక్రయించింది. గెలాక్సీ నోట్ 9 వార్షిక అమ్మకాలు 9.6 మిలియన్ యూనిట్లుగా నమోదయ్యాయి. గెలాక్సీ నోట్ 9 సిరీస్ సేల్స్ ఫస్ట్ ఇయర్‌లో 9.5 మిలియన్ యూనిట్లలో తర్వాతి స్థానంలో ఉంది. అయితే గెలాక్సీ నోట్ 20 సిరీస్ ఫోన్లు మొదటి సంవత్సరంలో 7.5 మిలియన్ యూనిట్ల సేల్స్ నమోదు చేసింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Mobile phones, Samsung, Samsung Galaxy, Technology

తదుపరి వార్తలు