హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Galaxy S22 Ultra: శాంసంగ్ 5జీ ఫోన్‌పై రూ.30 వేల డిస్కౌంట్.. ఆఫర్ ఒక్క రోజే!

Galaxy S22 Ultra: శాంసంగ్ 5జీ ఫోన్‌పై రూ.30 వేల డిస్కౌంట్.. ఆఫర్ ఒక్క రోజే!

Samsung Offer: శాంసంగ్ 5జీ ఫోన్‌పై రూ.30 వేల డిస్కౌంట్.. ఆఫర్ ఒక్క రోజే!

Samsung Offer: శాంసంగ్ 5జీ ఫోన్‌పై రూ.30 వేల డిస్కౌంట్.. ఆఫర్ ఒక్క రోజే!

5G Phone | కొత్త ఫోన్ కొనాలని భావించే వారికి అదిరే శుభవార్త. ఎందుకంటే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 30 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Amazon Offer | స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి తీపికబురు. అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై కళ్లుచెదిరే డీల్ లభిస్తోంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో (Amazon) డీల్ ఆఫ్ ద డే కింద ఈ ఆఫర్ (Offer) పొందొచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా 5జీ ఫోన్‌పై ఏకంగా రూ. 30 వేల తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ వివరాలు ఒకసారి తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా 5జీ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 1,31,999గా ఉంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ. 1,06,999కు కొనొచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్ కింద రూ. 5 వేల అదనపు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 25 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింప అందుబాటులో ఉంది.

ఏకంగా రూ.17 వేల డిస్కౌంట్.. రూ.12,990కే 39 ఇంచుల టీవీ, కిర్రాక్ ఆఫర్!

ఈ శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల సూపర్ అమొలెడ్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే ఉంది. ఇంకా ఇందులో హెచ్‌డీఆర్ 10 ప్లస్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 5జీ, 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో 108 ఎంపీ, 12 ఎంపీ, 10 ఎంపీ, 10 ఎంపీ రియర్ కెమెరా ఉంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 40 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అంటే ఫోగోగ్రపీ ప్రియులకు ఈ ఫోన్ కరెక్ట్‌గా సరిపోతుందని చెప్పుకోవచ్చు.

రోజుకు రూ.2 ఖర్చు.. ఏడాదంతా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు, రోజుకు 2 జీబీ డేటా వస్తుంది!

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్ బిల్ట్ ఎస్ పెన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 25 వాట్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్, 10 వాట్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అందువల్ల ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు ఈ ఆఫ్ పొందొచ్చు. 9 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 11,889 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ ఈఎంఐ అయితే 24 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 5239 చెల్లించాలి.

First published:

Tags: 5g phones, Amazon, Latest offers, Mobile offers, Samsung, Samsung Galaxy

ఉత్తమ కథలు