Home /News /technology /

SAMSUNG GALAXY S21 PLUS GALAXY S21 PRICE IN INDIA DROPS OFFLINE HERE IS DISCOUNT DETAILS SK GH

Samsung: శామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​ 21​ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్​.. రూ. 5 వేల డిస్కౌంట్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Samsung Mobile Phones: శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్​21 మోడల్​పై అదిరిపోయే ఆఫర్​ ప్రకటించింది శామ్‌సంగ్. ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి రూ. 5,000 డిస్కౌంట్​ అందిస్తోంది. ఆ వివరాలు చూద్దాం.

దక్షిణ కొరియా (South Korea) స్మార్ట్​ దిగ్గజం శామ్​సంగ్ తన​ గెలాక్సీ ఎస్​21 మోడల్​ (Samsung Galaxy s21)పై అదిరిపోయే ఆఫర్​ ప్రకటించింది. ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి రూ. 5,000 డిస్కౌంట్​ అందిస్తోంది. దీనితో పాటు శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్​ 21 ప్లస్ మోడల్​​పై కూడా ఆఫ్‌లైన్ మార్కెట్‌లో రూ. 5,000 తగ్గింపును అందిస్తోంది. శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్​ 22 లాంచ్​ అవుతున్న నేపథ్యంలో గెలాక్సీ ఎస్​ 21పై ఈ ఆఫర్​ను ప్రకటించడం విశేషం. కాగా, శామ్‌సంగ్‌​ గెలాక్సీ ఎస్​ 21 భారత మార్కెట్​లో రూ.69,999 ధర వద్ద విడుదలైంది. అయితే విడుదలైన కొన్ని నెలల తర్వాత ఈ ఫోన్​పై రూ. 5 వేల డిస్కౌంట్ (Discount) ప్రకటించింది. అంటే, ప్రస్తుతం ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 64,999 ధర వద్ద అందుబాటులో ఉంది. తాజా ఆఫర్ తర్వాత, మరో రూ. 5 వేల డిస్కౌంట్​ లభిస్తుంది. తద్వారా ఇప్పుడు ఈ స్మార్ట్​ఫోన్​ను కేవలం రూ. 59,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అసలు ధరతో పోలిస్తే ఇప్పుడు దీనిపై ఏకంగా రూ. 10 వేల తగ్గింపు లభిస్తుంది.

Moto G51: రూ.15,000 బడ్జెట్‌లో మోటో జీ51 రిలీజ్... ఫీచర్స్ ఇవే

శామ్‌సంగ్‌​ గెలాక్సీ ఎస్​ 21.. 8 జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్​పై కూడా రూ. 5 వేల డిస్కౌంట్​ లభిస్తుంది. దీని అసలు ధర రూ. 68,999 వద్ద ఉండగా.. ఇప్పుడు రూ. 63,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. శామ్‌సంగ్‌​ గెలాక్సీ ఎస్​ 21 ప్లస్ వేరియంట్​పై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీని కొనుగోలుపై అదనంగా రూ. 5,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. శామ్‌సంగ్‌​ గెలాక్సీ ఎస్​ 21 ప్లస్​ రూ. 81,999 వద్ద రిలీజ్ అవ్వగా.. ప్రస్తుతం రూ.76,999 వద్ద అందుబాటులో ఉంది. అయితే తాజా క్యాష్‌బ్యాక్ ఆఫర్​ ద్వారా దీన్ని కేవలం రూ.71,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, 256 జీబీ వేరియంట్​ రూ.75,999 వద్ద లభిస్తుంది.

iPhone XR: ఐఫోన్ రూ.20,000 లోపే... అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్

శామ్‌సంగ్‌​ గెలాక్సీ ఎస్​ 21, ఎస్​ 21 ప్లస్​ స్పెసిఫికేషన్లు

గెలాక్సీ ఎస్​21, ఎస్​21 ప్లస్​లో డిస్​ప్లే, బ్యాటరీ మినహా మిగతా అన్ని ఫీచర్లు ఒకే రకంగా ఉంటాయి. శామ్‌సంగ్‌​​ గెలాక్సీ ఎస్​21 మోడల్ 6.2 -అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. అయితే, గెలాక్సీ ఎస్​ 21 ప్లస్ మోడల్ మాత్రం 6.7 -అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు మోడళ్లు ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేతో వస్తాయి. ఇవి ఎక్సినోస్​ 2100 ఎస్​ఓసీ ప్రాసెసర్​తో పనిచేస్తాయి. 25w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. గెలాక్సీ ఎస్​ 21 మోడల్​ 4000 mAh బ్యాటరీ, గెలాక్సీ ఎస్​ 21 ప్లస్​ మోడల్ 4,800 mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. ఇక, కెమెరా విషయానికి వస్తే,. వీటి వెనుకవైపు 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 3x జూమ్‌తో కూడిన 64 ఎంపీ టెలిఫోటో కెమెరాలను చేర్చింది. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 10 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Latest Technology, Samsung, Samsung Galaxy, Smart phone, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు