హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Upcoming Smartphones: ఈ వారం నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్

Upcoming Smartphones: ఈ వారం నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్

Upcoming Smartphones: ఈ వారం నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్

Upcoming Smartphones: ఈ వారం నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్

Upcoming Smartphones | ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్స్ ఏవీ మీకు నచ్చలేదా? అయితే కొద్ది రోజులు ఆగండి. మరిన్ని కొత్త మొబైల్స్ (New Smartphones) రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారంలోనే ప్రపంచానికి పరిచయం కాబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే.

ఇంకా చదవండి ...

మన దేశంలో సెల్ ఫోన్ లేని వారు దాదాపుగా లేరంటే అతిశయోక్తి కాదు. కొందరయితే రెండు ఫోన్లు కూడా వాడుతూ ఉంటారు. అనేక ఫోన్లు మార్కెట్లోకి వచ్చినా కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతున్న ఫోన్లపై అనేక మందికి ఆసక్తి ఉంటుంది. వినియోగదారులకు ఈ వారం మరో నాలుగు ఫోన్లు (Upcoming Smartphones) అందుబాటులోకి రానున్నాయి. శామ్​సంగ్, గూగుల్, మోటరోలా, అసుస్ కంపెనీలు ఈ ఫోన్లను కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నాయి. అయితే ఈ ఫోన్లన్నీ భారత్ మార్కెట్లో విడుదల కావడం లేదు. ఒక ఫోన్ అయితే జనవరి దాకా అందుబాటులోకి రాదని తెలుస్తోంది. అయితే కొత్తగా విడుదల కానున్న ఫోన్లు, వాటి ఫీచర్లు ఒక్కసారి పరిశీలిద్దాం.

మోటరోలా ఎడ్జ్ ఎస్


స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్ జత చేసిన మోటరోలా ఎడ్జ్ ఎస్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో రానుంది. ఫోన్ ముందుభాగంలో 108 మెగా ఫిక్సల్ కెమెరా, 25 మెగా ఫిక్సల్ సెల్పీ షూటర్ ఉండే అవకాశం ఉంది. 6.7 అంగుళాల సైజుతో పంచ్ హోల్ డిస్ ఫ్లే ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకత. అక్టోబరు 20న ఈ ఫోన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో


ఈ సంవత్సరం గూగుల్ నుంచి గూగుల్ ఫిక్సెల్ 6, ఫిక్సెల్ 6 ప్రో ఫోన్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్లు గూగుల్ టెన్సార్ ఎస్వోసీ, టెలిఫోటో జూమ్ లెన్స్ (4x) కెమెరా ఉండే అవకాశం ఉంది. ఫిక్సెల్ 6 ఈ నెల 19 విడుదల కానుంది. అయితే విడుదల అయ్యే సమయానికి భారత్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ,ఫాన్స్, తైవాన్, జపాన్, అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో ఫిక్సెల్ 6 విడుదల కానుంది.

WhatsApp Feature: పొరపాటున వాట్సప్ మెసేజ్ డిలిట్ చేశారా? తిరిగి పొందొచ్చు ఇలా

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ


శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ ఫోన్ పై అనేక వదంతులు వచ్చాయి. అయితే అక్టోబరు 20న ఈ ఫోను విడుదల కానుంది. చాలా త్వరగా ఛార్జింగ్ సౌకర్యంతో 6.4 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్, 8జీబీ ర్యామ్ ఫీచర్లును ప్రకటింస్తుందని శ్యాంసంగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. భారీగా ఈ ఫోన్లు ఉత్పత్తి చేయడానికి జనవరిదాకా పట్టే అవకాశం ఉంది.

ఏసుస్ 8 జెడ్


ఏసుస్ జన్ ఫోన్ 8 విడుదలై 5 నెలలు కావస్తోంది. అయినా ఇప్పటికీ మన దేశంలో అందుబాటులోకి రాలేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్ లో అసుస్ 8జడ్ విడుదల ఆలస్యం కావచ్చని అసుస్ కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్, 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ సౌకర్యాలు ఉంటాయి. అయితే ఈ ఫోన్ మన దేశంలో ఎప్పుడు విడుదల చేస్తారో కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

First published:

Tags: 5G Smartphone, Asus, Google, Mobile News, Mobiles, Motorola, Samsung, Smartphone