ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల శ్రేణుల్లో శామ్సంగ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ కాంపిటీషన్ ఉంటే మిడ్ రేంజ్ విభాగంలో కూడా వివిధ స్మార్ట్ఫోన్లను శామ్సంగ్ లాంచ్ చేసింది. కంపెనీ తన M సిరీస్‌లో మరో కొత్త ఫోన్ Galaxy M53 5G డివైజ్‌ను లాంచ్ చేసింది. ఇది గత సంవత్సరం మార్కెట్లోకి అడుగుపెట్టిన Galaxy M52 స్మార్ట్‌ఫోన్‌కు అప్డేటెడ్ వెర్షన్. కొత్తగా లాంచ్ అయిన ఫోన్ ధర రూ.26,499గా ఉంది. ఇతర బ్రాండ్ల మాదిరిగానే ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఎక్కువ ధరకు అయినా సరే కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సిద్ధపడే రేంజ్లో ఫోన్ ఫీచర్లను శామ్సంగ్ అందిస్తోందా, లేదా..? ఈ స్మార్ట్‌ఫోన్ రివ్యూ ఎలా ఉంది..? కస్టమర్లు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
డిజైన్
గెలాక్సీ ఎం53 5జీ 176 గ్రాముల బరువుతో పాటు సొగసైన ఫ్రేమ్‌తో వస్తుంది. ఫోన్ చాలా తేలికగా ఉంటుంది. ఫోన్లో బ్యాటరీ ఉందా లేదా అని ఆశ్చర్యపడే అంత నాజూకుగా కనిపిస్తుంది. ఫోన్ హెడ్‌ఫోన్ జాక్ ఉండదు, SIM స్లాట్‌తో పాటు పవర్, వాల్యూమ్ బటన్లు మాత్రమే ఉంటాయి. క్వాడ్ రియర్ కెమెరాలు, స్వేర్ షేప్డ్ మాడ్యూల్లో ఉంటాయి. పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ వస్తుంది.
డిస్ప్లే
శామ్సంగ్ కంపెనీ ఫోన్ డిస్ప్లేపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. గెలాక్సీ ఎం53 5జీ 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. 85.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉంటుంది. AMOLED ప్యానెల్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.
హార్డ్‌వేర్
గెలాక్సీ ఎం53 5జీని మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్, 6GB లేదా 8GB RAMతో వస్తుంది. SIM స్లాట్‌ని ఉపయోగించి 128GB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.
సాఫ్ట్వేర్
శామ్సంగ్ ఫోన్ల కోసం సాఫ్ట్వేర్ అప్డేట్లపై దృష్టి సారించి చాలా మార్పులు తీసుకువచ్చింది. గెలాక్సీ ఎం53 5జీ సరికొత్త ఆండ్రాయిడ్ 12-బేస్డ్ One UI 4.1 వెర్షన్‌తో వస్తుంది. ఇది కంపెనీ నుంచి 2 సంవత్సరాల OS అప్డేట్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను పొందుతుందని స్పష్టం చేసింది. వెర్షన్ 4.0తో UI ఇంటర్ఫేస్ అందంగా కనిపిస్తుంది.
కెమెరాలు
శామ్సంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ప్రత్యేకించి లో లైట్ షూటింగ్ విషయానికి వస్తే పగటిపూట యాంపిల్ లైట్‌తో అద్భుతమైన ఫోటోలను తీసే అవకాశం ఉంది. ఫ్రంట్ 32-మెగాపిక్సెల్ కెమెరా సాధారణ పరిస్థితుల్లో బాగా పని చేస్తుంది.
బ్యాటరీ
గెలాక్సీ ఎం53 5జీ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తూ.. నాజూకుగా ఫోన్ కనిపిస్తుంది. సాధారణ అవసరాలకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒకటిన్నర రోజుల పాటు సులభంగా ఫోన్‌ని ఉపయోగించవచ్చు. ఈ ఫోన్‌తో బాక్స్‌లో ఛార్జింగ్ అడాప్టర్ లేదా USB టైప్ C కేబుల్‌ను అందించడం ఆపేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g mobile, Samsung, Smart phone, Tech news