SAMSUNG GALAXY M53 5G VS ONEPLUS NORD CE 2 5G KNOW ABOUT WHICH IS THE BEST SMARTPHONE UNDER RS 25000 SS
Samsung vs OnePlus: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 మొబైల్‌కు పోటీగా సాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్... తేడాలు ఇవే
Samsung vs OnePlus: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 మొబైల్‌కు పోటీగా సాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్... తేడాలు ఇవే
(image: Samsung India)
Samsung Galaxy M53 5G vs OnePlus Nord CE 2 5G | మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో (MediaTek Dimensity 900 processor) ఇండియాలో పలు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఇప్పుడు ఇదే ప్రాసెసర్‌తో రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం53 స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 మొబైల్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో ఇండియాలో సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ (Samsung Galaxy M53 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉండటం విశేషం. ఇదే ప్రాసెసర్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ (OnePlus Nord CE 2 5G) స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఒకే బడ్జెట్‌లో లభిస్తున్నాయి. దీంతో రూ.25,000 లోపు బడ్జెట్‌లో ఉన్న సాంసంగ్ గెలాక్సీ ఎం53, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 స్మార్ట్‌ఫోన్ల మధ్య పోటీ నెలకొంది. అసలు ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? కామన్‌గా ఉన్న ఫీచర్స్ ఏంటీ? స్పెసిఫికేషన్స్ విషయంలో ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్? తెలుసుకోండి.
స్పెసిఫికేషన్స్
సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ
డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే
డిస్‌ప్లే విషయానికి వస్తే సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఉండగా, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 108మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటే, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ Sony IMX 616 ఫ్రంట్ కెమెరా ఉంటే, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ Sony IMX471 ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ కెపాసిటీ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లోనే ఎక్కువగా ఉంది. ధర విషయం చూసినా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ కన్నా సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఎక్కువ.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.