సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ (Samsung Galaxy M Series) స్మార్ట్ఫోన్లు ఇండియాలో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో బాగా పాపులర్ అయ్యాయి. ఇదే సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ (Samsung Galaxy M53 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది కంపెనీ. గతేడాది రిలీజైన సాంసంగ్ గెలాక్సీ ఎం52 అప్‌గ్రేడ్ మొబైల్ ఇది. రూ.25,000 లోపు సెగ్మెంట్లో రిలీజైంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో ఉన్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2, షావోమీ 11ఐ సిరీస్, రియల్మీ 9 ప్రో లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 108మెగాపిక్సెల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ ధర
సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,499. అమెజాన్‌లో ఏప్రిల్ 29న సేల్ ప్రారంభం కానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.23,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.25,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. డీప్ ఓషియన్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.
సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఉంది. డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇన్ఫీనిక్స్ జీరో 5జీ, ఒప్పో రెనో6, ఒప్పో రెనో7, టెక్నో పోవా 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 స్మార్ట్ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లో రిలీజైంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 16జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అయితే ఛార్జర్‌ను బాక్సులో ఇవ్వట్లేదు సాంసంగ్. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + వన్‌యూఐ 4.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్లపాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనుంది కంపెనీ.
సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 108మెగాపిక్సెల్ ప్రైమరీ + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం Sony IMX 616 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. కెమెరాలో సింగిల్ టేక్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో ఒకే క్లిక్‌తో 10 ఔట్‌పుట్స్ తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఎరేజర్, ఫోటో రీమాస్టర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.