SAMSUNG GALAXY M53 5G LAUNCH NEXT MONTH LEAKED PRICE IN ONLINE AND KNOW THE DETAILS OF FEATURES HERE GH VB
Samsung Galaxy M53 5G: వచ్చే నెలలో శామ్సంగ్ గెలాక్సీ ఎం 53 5జీ లాంచ్.. ఆన్లైన్లో లీకైన ధర, ఫీచర్ల వివరాలివే!
ప్రతీకాత్మక చిత్రం
దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్సంగ్ వరుస స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌తో దూసుకుపోతుంది. ఇదే స్పీడ్‌తో వచ్చే నెల గెలాక్సీ ఎం53 5జీ ఫోన్ లాంచింగ్‌కు కంపెనీ సిద్దమవుతోంది.
దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్సంగ్ వరుస స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌తో దూసుకుపోతుంది. ఇదే స్పీడ్‌లో వచ్చే నెల గెలాక్సీ ఎం53 5జీ ఫోన్ లాంచింగ్‌కు కంపెనీ సిద్దమవుతోంది. గెలాక్సీ ఎం53 5జీ ఫోన్ గెలాక్సీ ఎం52(Galaxy M 52) 5జీ ఫోన్‌కు కొనసాగింపుగా రానుంది. శామ్సంగ్ వియత్నాం అధికారిక ఫేస్బుక్ పేజీ దీని లాంచింగ్‌ను ధృవీకరించింది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫోన్ వియత్నాం మార్కెట్లోకే రానుంది. భారత్‌తో సహా ఇతర దేశాల్లో లాంచింగ్‌పై స్పష్టత లేదు. ఈ ఫోన్ 120Hz డిస్ప్లేను కలిగి ఉంటుందని, క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే, గతంలో విడుదలైన గెలాక్సీ M52 5G ఫోన్లో మాత్రం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది.
అధికారిక లాంచింగ్‌కు ముందే గెలాక్సీ M53 5G స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీకయ్యాయి. అయితే, ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఇటీవల కొన్ని ముఖ్యమైన ఫీచర్లను ట్వీట్ చేశారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం, శామ్సంగ్ గెలాక్సీ ఎం53 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7-అంగుళాల sAMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ 900 5G SoC ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుకవైపు కెమెరా సెటప్‌లో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 -మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, రెండు 2 -మెగాపిక్సెల్ షూటర్ కెమెరాలను చేర్చింది. దీని ముందు ప్యానెల్లో సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 32 -మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను అందించనుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12- ఆధారిత వన్ యూఐ4.1 ఓఎస్‌పై పనిచేస్తుంది. దీనిలోని 5,000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది.
ఏప్రిల్ నెలలో గెలాక్సీ M53 5G ఫోన్‌తో పాటు గెలాక్సీ M33 5Gని కూడా లాంచ్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది. గెలాక్సీ M33 5G పెద్ద 6,000mAh బ్యాటరీతో రానుంది. దీని ధర రూ. 20,000 లోపే ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం, గెలాక్సీ M32 5G 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.16,999 వద్ద లభిస్తుంది. ఇక, 8GB ర్యామ్ వేరియంట్ రూ. 18,999 వద్ద అందుబాటులో ఉంది. మరోవైపు, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ (4G సపోర్ట్) ధర రూ.16,999 వద్ద లభిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.