SAMSUNG GALAXY M52 5G TO VIVO X70 SERIES TOTAL 14 NEW SMARTPHONES TO LAUNCH IN FEW DAYS SALE BEGINS IN FLIPKART BIG BILLION DAYS SALE AND AMAZON GREAT INDIAN FESTIVAL SALE SS
Upcoming Smartphones: కొత్త మొబైల్ కొనాలా? దసరా ముందు రిలీజ్ అయ్యే 14 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Upcoming Smartphones: కొత్త మొబైల్ కొనాలా? దసరా ముందు రిలీజ్ అయ్యే 14 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Upcoming Smartphones | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? దసరా కన్నా ముందే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పోటాపోటీగా స్మార్ట్ఫోన్లను (New Smartphones) రిలీజ్ చేయబోతున్నాయి. దసరా లోపు 14 కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంఛ్ కానున్నాయి.
షావోమీ, రియల్మీ, ఒప్పో, సాంసంగ్, పోకో ఇండియా,మోటోరోలా లాంటి కంపెనీలన్నీ కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను పరిచయం చేయబోతున్నాయి. అక్టోబర్‌లో దసరా సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale), అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర సేల్స్‌తో పోలిస్తే ఈ సేల్స్‌లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఎక్కువ ఉంటాయి. అందుకే స్మార్ట్ఫోన్ల కంపెనీలన్నీ ఈ సేల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. మరి దసరా లోపు రాబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఏవో తెలుసుకోండి.
Realme Narzo 50 Series: రియల్మీ నుంచి సెప్టెంబర్ 24న రెండు స్మార్ట్‌ఫోన్స్ రాబోతున్నాయి. రియల్మీ నార్జో 50 సిరీస్‌ను పరిచయం చేయబోతోంది కంపెనీ. రియల్మీ నార్జో 50ఏ, రియల్మీ నార్జో 50ఐ స్మార్ట్ఫోన్లు లాంఛ్ కానున్నాయి. ఇప్పటికే ఇండియాలో రియల్మీ నార్జో 30 సిరీస్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.
Oppo A55: ఒప్పో ఏ55 స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 27న లాంఛ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది. 6.5 అంగుళాల పంచ్ హోల్ డిస్ప్లే, డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.
Samsung Galaxy M52 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం51 అప్‌గ్రేడ్ వర్షన్ సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 28న ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్, ఫుల్హెచ్డీ+ సూపర్ అమొలెడ్ ప్లస్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 11 5జీ బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనొచ్చు.
Samsung Galaxy F42 5G: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 29న లాంఛ్ కానుంది. 6.6 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.
Xiaomi Mi 11 Lite NE 5G: షావోమీ నుంచి ఎంఐ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 29న లాంఛ్ కానుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే, 4,250ఎంఏహెచ్ బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనొచ్చు.
Poco C4: పోకో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది. సెప్టెంబర్ 30న పోకో సీ4 స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఫీచర్స్ వివరాలు ఇంకా తెలియదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.
Vivo X70 series: వివో నుంచి ఎక్స్70 సిరీస్ స్మార్ట్ఫోన్లు సెప్టెంబర్ 30న లాంఛ్ కానున్నాయి. ఇప్పటికే చైనాలో వివో ఎక్స్70, వివో ఎక్స్70 ప్రో, వివో ఎక్స్70 ప్రో+ స్మార్ట్ఫోన్లు లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్, 4000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.
Motorola Edge 20 Pro: మోటోరోలా ఎడ్జ్ సిరీస్‌లో ఇప్పటికే మోటోరోలా ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 ఫ్యూజన్ రిలీజ్ అయ్యాయి. అక్టోబర్ 1న మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో స్మార్ట్‌ఫోన్ రానుంది. 6.7 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 108మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.
Realme GT Neo2: రియల్మీ జీటీ నియో2 స్మార్ట్‌ఫోన్ ఇటీవల గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ మొదటివారంలోనే ఇండియాలో రిలీజ్ కానుంది. 6.62 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.