సాంసంగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది సాంసంగ్. గెలాక్సీ ఎం సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ (Samsung Galaxy M52 5G) మోడల్‌ను పరిచయం చేసింది. గతేడాది రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం51 అప్‌గ్రేడ్ మోడల్ ఇది. ఈసారి 5జీ సపోర్ట్‌తో సాంసంగ్ గెలాక్సీ ఎం52 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయడం విశేషం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) సందర్భంగా ఈ కొత్త మొబైల్‌ను పరిచయం చేసింది సాంసంగ్. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇదే ప్రాసెసర్ రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్, సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్లలో కూడా ఉంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ సేల్ అక్టోబర్ 3న ప్రారంభం కానుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999. ఇక 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర తెలియాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు రూ.1,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్ ఇండియా, సాంసంగ్ ఇండియా ఇ-స్టోర్‌లో కొనొచ్చు.
The Leanest Meanest Monster Ever is here folks. Get ready to bag the all-new #GalaxyM52 5G, the leanest monster at just 7.4mm, and meanest with 6nm Snapdragon 778G processor, segment best FHD+ sAMOLED+ 120Hz display and Galaxy 5G - 11 bands support. pic.twitter.com/D185gjqenx
— Samsung India (@SamsungIndia) September 28, 2021
సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్‌రేట్‌తో 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం.
Realme Offers: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 10 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్
సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 11 5జీ బ్యాండ్స్, 4జీ వీఓ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 12 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో సింగిల్ టేక్ కెమెరా ఫీచర్ ఉంది. ఒక్క టేక్‌లో 10 ఫోటోస్ క్లిక్ చేయడంతో పాటు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. బ్లేజింగ్ బ్లాక్, ఐసీ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Amazon, Amazon Great Indian Festival Sale, AMAZON INDIA, Mobile News, Mobiles, Samsung, Smartphone