Samsung Galaxy m51: రిలీజ్‌కు ముందే తెలిసిపోయిన సాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫీచర్స్

Samsung Galaxy m51 | ఇండియన్ మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను సాంసంగ్ రిలీజ్ చేయబోతోంది. ఇప్పటికే సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్పెసిఫికేషన్స్ తెలిసిపోయాయి.

news18-telugu
Updated: September 8, 2020, 11:03 AM IST
Samsung Galaxy m51: రిలీజ్‌కు ముందే తెలిసిపోయిన సాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫీచర్స్
Samsung Galaxy m51: రిలీజ్‌కు ముందే తెలిసిపోయిన సాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫీచర్స్ (image: Samsung India)
  • Share this:
సాంసంగ్ నుంచి భారీ ఫీచర్స్‌తో మరో స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 12 గంటలకు సాంసంగ్ గెలాక్సీ ఎం51 రిలీజ్ కానుంది. సాధారణంగా చాలావరకు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్ రిలీజ్ సమయంలోనే తెలుస్తాయి. కొన్ని స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్ ముందే లీక్ అవుతుంటాయి. కానీ సాంసంగ్ మాత్రం సెప్టెంబర్ 10న రిలీజ్ చేయబోయే సాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫీచర్స్‌ని ముందే అధికారికంగా ప్రకటించేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ లాంటి ప్రత్యేకతలున్నాయి. భారతదేశంలో 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రిలీజ్ అవుతున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే ఉంటుంది.


ఇక ఇప్పటికే సాంసంగ్ నుంచి వచ్చిన గెలాక్సీ ఎం21, ఎం31, ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్లలో ఎక్సినోస్ 9611 ప్రాసెసర్ ఉంది. కానీ సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్‌లో మాత్రం స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్ ఉంది. ఎక్సినోస్ 9611 ప్రాసెసర్ కన్నా స్నాప్‌డ్రాగన్ 730జీ పర్ఫామెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు అధికారికంగా తెలిసిన స్పెసిఫికేషన్స్ ఇవే. అయితే సెల్ఫీ కెమెరా ఎంత ఉంటుంది, ఏఏ వేరియంట్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవుతుందో తెలియదు. ఇండస్ట్రీలో 32మెగాపిక్సెల్ కన్నా ఎక్కువ ఫ్రంట్ కెమెరా లేదు. ఇందులో కూడా 32మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చని అంచనా. ర్యామ్ 6జీబీ, 8జీబీ, స్టోరేజీ 128జీబీ, 256జీబీ ఉండొచ్చు.

Oppo F17 Pro: ఒప్పో ఎఫ్17 ప్రో సేల్ ప్రారంభం... రూ.1,500 డిస్కౌంట్ పొందండి ఇలాRealme 7 Pro vs OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్‌కు పోటీగా రియల్‌మీ 7 ప్రో... ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్

ఇక సాంసంగ్ గెలాక్సీ ఎం51 ధర రూ.25,000 లోపు ఉండొచ్చని అంచనా. ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్, ఒప్పో ఎఫ్17 ప్రో, వివో వీ19, రియల్‌మీ 7 ప్రో లాంటి స్మార్ట్‌ఫోన్లకు పోటీ ఇవ్వనుంది సాంసంగ్ గెలాక్సీ ఎం51.
Published by: Santhosh Kumar S
First published: September 8, 2020, 11:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading