SAMSUNG GALAXY M51 LAUNCHED IN INDIA WITH 7000MAH HUGE BATTERY SNAPDRAGON 730G PROCESSOR KNOW PRICE AND SPECS SS
Samsung Galaxy m51: అదిరే ఫీచర్స్‌తో సాంసంగ్ గెలాక్సీ ఎం51 రిలీజ్... ధర ఎంతో తెలుసా
Samsung Galaxy m51: అదిరే ఫీచర్స్‌తో సాంసంగ్ గెలాక్సీ ఎం51 రిలీజ్... ధర ఎంతో తెలుసా
(image: Samsung India)
Samsung Galaxy m51 | సాంసంగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. సాంసంగ్ గెలాక్సీ ఎం51 మోడల్ ఇండియాకు వచ్చింది. ధర, ఫీచర్స్, ఆఫర్స్ గురించి తెలుసుకోండి.
అదిరిపోయే ఫీచర్స్‌తో సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. కొంతకాలంగా టీజర్లతో హైప్ క్రియేట్ చేసిన సాంసంగ్ మొత్తానికి సాంసంగ్ గెలాక్సీ ఎం51 మోడల్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. వీటిలో ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని ఫీచర్స్ ఇప్పటికే తెలుసు. 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. భారతదేశంలో ఇంత భారీ బ్యాటరీ కెపాసిటీతో రిలీజైన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని సాంసంగ్ చెబుతోంది. ఇప్పటివరకు ఇండియాలో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతోనే స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. అందులో సాంసంగ్ కంపెనీకి చెందిన మోడల్స్ ఎక్కువ. ఇక సాంసంగ్ గెలాక్సీ ఎం51 విషయానికి వస్తే 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 6.7 అంగుళాల భారీ సూపర్ అమొలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ Sony IMX682 సెన్సార్‌తో క్వాడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ Sony IMX616 సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి.
సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్స్‌లో రిలీజైంది. ప్రారంభ ధర రూ.24,999. సెప్టెంబర్ 18న అమెజాన్‌లో సేల్ మొదలవుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో కొనేవారికి రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఇటీవల ఇంతకన్నా కాస్త తక్కువ ఫీచర్స్‌తో సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ రిలీజైన సంగతి తెలిసిందే. సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే సాంసంగ్ గెలాక్సీ ఎం51 మోడల్లో ఫీచర్స్ బాగున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్మీ 7 ప్రో, ఒప్పో ఎఫ్17 ప్రో, వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్లకు సాంసంగ్ గెలాక్సీ ఎం51 గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.
The biggest, the baddest, the boldest and the brightest is here to take over. Presenting the all-new #SamsungM51. This #MeanestMonsterEver has got the meanest, maddest moves that will leave you craving for it. pic.twitter.com/KIclbtylCT
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.