Samsung: సాంసంగ్ మరో సంచలనం... భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్... ఎంతంటే

Samsung Galaxy M41 | మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎంత? 4,000 లేదా 5,000 ఎంఏహెచ్ ఉంటుందా? ఇటీవల 6,000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న ఫోన్లు కూడా వచ్చాయి. త్వరలో ఇంతకన్నా ఎక్కువ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయబోతోంది సాంసంగ్.

news18-telugu
Updated: July 6, 2020, 3:24 PM IST
Samsung: సాంసంగ్ మరో సంచలనం... భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్... ఎంతంటే
Samsung: సాంసంగ్ మరో సంచలనం... భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సాంసంగ్ మరో సంచలనం సృష్టించబోతోంది. భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయబోతోంది. ఇప్పటికే 6,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేసింది సాంసంగ్. ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే 6,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ. ఒకప్పుడు 4,000ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే చాలనుకున్నారు. కానీ యూసేజ్ పెరగడంతో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్లు రావడం మొదలైంది. కానీ సాంసంగ్ ఏకంగా 6,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఫోన్లు రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. సాంసంగ్ అంతటితో ఆగట్లేదు. అంతకన్నా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సాంసంగ్ ఎం సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ఎం41 మోడల్ రాబోతోంది. ఈ ఫోన్ బ్యాటరీ ఎంతో తెలుసా? 6,800ఎంఏహెచ్.

WhatsApp: వాట్సప్ నుంచి కొత్తగా 5 ఫీచర్స్... విశేషాలివే

Jio offer: జియో నుంచి డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం... పొందండి ఇలా

ఏకంగా 6,800ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో సాంసంగ్ గెలాక్సీ ఎం41 స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి పరిచయమయ్యే అవకాశముంది. ఈ విషయాన్ని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. ఓ స్మార్ట్‌ఫోన్‌లో ఇంత భారీ బ్యాటరీ ఉండటం సంచలనమే. సాంసంగ్ గెలాక్సీ ఎం41 స్మార్ట్‌ఫోన్‌లో 64+12+5 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఎక్సినోస్ 9630 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ లాంటి ఫీచర్స్ ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం40 కన్నా కాస్త ఎక్కువ ఫీచర్స్‌తో సాంసంగ్ గెలాక్సీ ఎం41 రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
Published by: Santhosh Kumar S
First published: July 6, 2020, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading