దక్షిణ కొరియా(South Korea) మొబైల్(Mobile) దిగ్గజం శామ్సంగ్ తన గెలాక్సీ(Samsung Galaxy) ‘M’ సిరీస్ నుంచి ఒకేసారి రెండు స్మార్ట్ఫోన్లను(Smartphones) లాంచ్ చేసింది. శామ్సంగ్ గెలాక్సీ M33, గెలాక్సీ M23 అనే రెండు కొత్త స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఈ రెండు ఫోన్లలో చిన్న తేడాలు తప్ప మిగతా స్పెసిఫికేషన్లన్నీ(Specifications) దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఈ స్మార్ట్ఫోన్లలో 6.6 -అంగుళాల డిస్ప్లేలు, 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ(Primary) రియర్ కెమెరాతో పాటు మరిన్ని ఫీచర్లను(Features) అందించింది. అయితే, ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్లో ఎప్పుడు లభిస్తాయనే విషయంపై కంపెనీ ఎటువంటి స్పష్టతనివ్వలేదు. కానీ, గెలాక్సీ M32 ఇప్పటికే భారత్‌లో లభిస్తున్నందున.. అతి త్వరలోనే గెలాక్సీ M33 ఫోన్‌ను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక, గెలాక్సీ M22 భారతదేశంలోకి రాలేదు. దీంతో, గెలాక్సీ M23 రిలీజ్ రాకకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కొత్త శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ ఫోన్లలోని స్పెసిఫికేషన్లను పరిశీలిద్దాం.
IRCTC Tirupat Tour: తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శనంతోతిరుపతి లోకల్ టూర్ ప్యాకేజీ
శామ్సంగ్ గెలాక్సీ M33, గెలాక్సీ M23 స్పెసిఫికేషన్లు
కొత్త శామ్సంగ్ ఎం సిరీస్ ఫోన్లు ఒకే రకమైన డిస్ప్లేతో వస్తాయి. వీటిలో6.6 -అంగుళాల TFT ఇన్ఫినిటీ-V ఫుల్ HD+ డిస్ప్లేను అందించింది. అయితే, వీటి ముందు వెర్షన్ల మాదిరిగా వీటిలో AMOLED ప్యానెల్ మాత్రం ఉండదు. కాకపోతే ఇవి రెండూ ఒకే రకమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇక, కెమెరా విషయానికి వస్తే.. శామ్సంగ్ గెలాక్సీ M23 వెనుక నాలుగు కెమెరాలు ఉంటాయి. క్వాడ్ కెమెరా సెటప్‌లో 50- మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, మాక్రో, డెప్త్ షాట్ల కోసం రెండు 2 -మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు ఉంటాయి. మరోవైపు, శామ్సంగ్ గెలాక్సీ M33 ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8- మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉంటాయి. అయితే, గెలాక్సీ M23లో ఉన్న విధంగా.. దీనిలో 2 -మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరా మాత్రం ఉండదు.
ఆక్టోకోర్ చిప్సెట్తో గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లు..
కాగా, శామ్సంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లలో ఉపయోగించే చిప్సెట్ పేర్లను మాత్రం శామ్సంగ్ ఇంకా వెల్లడించలేదు. ఆన్లైన్లో లీకైన సమాచారం ప్రకారం, వీటిలో ఆక్టా-కోర్ చిప్సెట్లను అందించనుంది. ఇదిలా ఉంటే, గెలాక్సీ M23 5,000mAh బ్యాటరీతో రానుంది. ఇక, గెలాక్సీ M33 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, వీటిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. ఈ రెండు బడ్జెట్ స్మార్ట్ఫోన్లు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. కాగా, ఈ రెండు స్మార్ట్ఫోన్ల ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, 5g technology, Mobile News, Mobiles, Smartphone