హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung Galaxy M33 5G: త్వరలోనే శామ్​సంగ్​ గెలాక్సీ M33 5G స్మార్ట్​ఫోన్​ లాంచ్​.. ఆన్​లైన్​లో లీకైన ఫీచర్ల వివరాలివే..

Samsung Galaxy M33 5G: త్వరలోనే శామ్​సంగ్​ గెలాక్సీ M33 5G స్మార్ట్​ఫోన్​ లాంచ్​.. ఆన్​లైన్​లో లీకైన ఫీచర్ల వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​ శామ్​సంగ్​ తన గెలాక్సీ M సిరీస్​ను విస్తరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో గెలాక్సీ M33 5G (Samsung Galaxy M33 5G) వేరియంట్​ను మార్కెట్​లోకి రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​ శామ్​సంగ్​ తన గెలాక్సీ M సిరీస్​ను విస్తరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో గెలాక్సీ M33 5G (Samsung Galaxy M33 5G) వేరియంట్​ను మార్కెట్​లోకి రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టులో మార్కెట్​లోకి వచ్చిన శామ్​సంగ్​ గెలాక్సీ 4G వేరియంట్​కు అప్​గ్రేడ్​ వెర్షన్​గా వస్తోంది. తాజాగా గీక్​బెంచ్​ లిస్టింగ్​లో గెలాక్సీ ఎం32 5జీ కనిపించింది. వెబ్​సైట్​లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ మోడల్​ ఎక్సినోస్​ 1200 చిప్‌సెట్​తో పనిచేస్తుంది.

కాగా, ఇదే ఎక్సినోస్​ 12‌00 చిప్​సెట్​ను శామ్​సంగ్​ గెలాక్సీ A53 5Gలో కూడా ఉపయోగించడం విశేషం. దీన్ని బట్టి, గెలాక్సీ ఎం22 స్మార్ట్​ఫోన్ గెలాక్సీ A53కి రీబ్రాండ్​ వెర్షన్​గా వస్తోందని చెప్పవచ్చు. గెలాక్సీ ఎం 33 స్మార్ట్​ఫోన్​ EB-BM336ABN మోడల్ నంబర్​తో రానుందని సేఫ్టీ కొరియా వెబ్​సైట్​ కూడా ధ్రువీకరించింది.

UPSC Exam: ఇంట్లోనే సివిల్​ సర్వీసెస్​కు సిద్ధమవుతున్నారా.. అయితే ఈ షెడ్యూల్​తో విజయం సాధించండి..


వెబ్​సైట్​ ప్రకారం, గెలాక్సీ ఎం33లో 6,000mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఇది 6 జీబీ ర్యామ్​తో వస్తుంది. అయితే ఈ ఫోన్ మల్టిపుల్ మెమరీ/స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్​ ఆండ్రాయిడ్​ 12 ఓఎస్​పై రన్​ అవుతుంది. అయితే దీని ధరపై మాత్రం ఎటువంటి స్పష్టతలేదు.

శామ్​సంగ్​ గెలాక్సీ ఎం32 5జీ స్పెసిఫికేషన్లు..

శామ్​సంగ్​ గెలాక్సీ ఎం 32 5జీ ఫోన్ 6.5 అంగుళాల హెచ్​డీ ప్లస్​ వి-డిస్‌ప్లేతో వస్తుంది. దీని పైభాగంలో వాటర్-డ్రాప్ నాచ్​, కింది భాగంలో స్లైట్​ చిన్​ వంటివి అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీ వేరియంట్‌లో మీడియాటెక్​ హీలియో G80 ఆక్టా-కోర్ చిప్‌సెట్​ను అందించింది. అయితే, రాబోయే గెలాక్సీ ఎం32 5జీ వేరియంట్​లో మాత్రం డైమెన్సిటీ 720 చిప్‌సెట్​ను చేర్చనుంది. ఈ స్మార్ట్​ఫోన్​ 6 జీబీ ర్యామ్​ లేదా 8 జీబీ ర్యామ్​తో పాటు 128 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​కు మద్దతిస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డు ద్వారా స్టోరేజ్​ను 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

Scholarships: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.31 వేల నుంచి రూ.70వేల మధ్య స్కాలర్​షిప్ పొందాలంటే.. ఇలా చేయండి..


కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో వెనుక భాగంలో 48 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5 ఎంపీ మాక్రో లెన్స్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్‌తో కూడిన క్వాడ్-కెమెరా సెటప్‌ను అందించనుంది. ఇక, ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం 13 ఎంపీ కెమెరా సెన్సార్లను చేర్చనుంది. ఇది 5,000mAh బ్యాటరీతో పాటు 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.

First published:

Tags: 5G Smartphone, Samsung

ఉత్తమ కథలు