ప్రముఖ స్మార్ట్ ఫోన్ (Smartphone) తయారీ సంస్థ సాంసంగ్ (Samsung) మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Galaxy A33 5G ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ లో 120Hz డిస్ప్లే తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ఇంకా 6000 mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ సాంసంగ్ గెలాక్సీ M సిరీస్ లో ఆగస్టు 2021లో విడుదలైన Galaxy M32 5G తర్వాతి ఫోన్. ఈ ఫోన్ ఇంకా రెండు స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇంకా రెండు కలర్ ఆప్షన్లు సైతం ఉన్నాయి. బేస్ 6GB+128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999గా ఉంది. ఇంకా 8GB+128GB వేరియంట్ ధరను రూ.40,499గా కంపెనీ నిర్ణయించింది. అయితే.. ప్రారంభ ఆఫర్ల కింద రూ.1000, రూ.500 చొప్పున ఈ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తోంది సాంసంగ్.
Smart Phone: మార్కెట్‌లోకి దూసుకొస్తున్న కొత్త ఫోన్‌లు.. అదిరిపోయే ఫీచర్స్ వివరాలు!
దీంతో ఈ ఫోన్లను వరుసగా రూ.17,999, రూ.19,999 కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్ల రెగ్యులర్ సేల్ ఏప్రిల్ 8న అమెజాన్, సాంసంగ్ ఇండియా స్టోర్స్ లలో ప్రారంభం కానుంది. Galaxy A73 5G సేల్ సైతం అదే రోజు ప్రారంభం కానుంది.
Galaxy M32 5G ఫోన్ ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ ఫోన్ 6.6 అంగుళాల Full-HD+ Infinity-V డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇంకా స్క్రీన్ కు గొరిల్లా Gorilla Glass 5 ప్రొటెక్షన్ ఉంటుంది. RAM ను 16 జీబీ వరకు పొడిగించుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 UI పై పని చేస్తుంది. ఈ ఫోన్లో 50MP+5MP+2MP కెమెరా సెట్ ఉంటుంది. ఇంకా సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8MP సెల్పీ కెమెరా అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Samsung