హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung Galaxy M32: రూ.14,999 ధరతో సాంసంగ్ గెలాక్సీ ఎం32 రిలీజ్... ఫీచర్స్ ఇవే

Samsung Galaxy M32: రూ.14,999 ధరతో సాంసంగ్ గెలాక్సీ ఎం32 రిలీజ్... ఫీచర్స్ ఇవే

Samsung Galaxy M32: రూ.14,999 ధరతో సాంసంగ్ గెలాక్సీ ఎం32 రిలీజ్... ఫీచర్స్ ఇవే
(image: Samsung India)

Samsung Galaxy M32: రూ.14,999 ధరతో సాంసంగ్ గెలాక్సీ ఎం32 రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: Samsung India)

Samsung Galaxy M32 | రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఫీచర్స్ తెలుసుకోండి.

ఇండియన్ మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. గెలాక్సీ ఎం సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం32 మోడల్‌ను రిలీజ్ చేసింది. ఇందులో 90Hz అమొలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ జీ80 ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.14,999. ఇది 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ ధర. ఇక 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.16,999. ఈ ఫోన్‌పై సాంసంగ్

ఇంట్రడక్టరీ ఆఫర్ ప్రకటించింది. సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,250 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.13,749 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,749 ధరకు సొంతం చేసుకోవచ్చు. జూన్ 28న అమెజాన్‌తో పాటు సాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ మొదలవుతుంది. ఇతర ప్రధాన రీటైల్ స్టోర్లలో కూడా సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.

Realme 7 Pro: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.4,000 తగ్గింది... మూడు రోజులే అవకాశం

WhatsApp Status: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఇక ఆ ఫీచర్ ఉండదు

సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాససెర్‌తో పనిచేస్తుంది. ముందువైపు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ షూటర్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో 15 వాట్ ఛార్జర్ మాత్రమే లభిస్తుంది. ఈ ఫోన్ బరువు 196 గ్రాములు. ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సాంసంగ్ పే మినీ యాప్‌తో పాటు ప్రైవసీ కోసం AltZLife మోడ్ ఉంటుందని సాంసంగ్ ప్రకటించింది.

Airtel Rs 456 Plan: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.456 ప్లాన్ ప్రకటించిన కంపెనీ

Android New Features: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 7 కొత్త ఆండ్రాయిడ్స్ ఫీచర్స్

రూ.15,000 సెగ్మెంట్‌లో ఇతర బ్రాండ్లకు పోటీ ఇవ్వనుంది సాంసంగ్ గెలాక్సీ ఎం32. ఈ సెగ్మెంట్‌లో రియల్‌మీ 8, రియల్‌మీ 8 5జీ, పోకో ఎం3 ప్రో, రెడ్‌మీ నోట్ 10ఎస్ లాంటి మోడల్స్ ఉన్నాయి.

First published:

Tags: Icici, Icici bank, Mobile, Mobile News, Mobiles, Samsung, Smartphone, Smartphones

ఉత్తమ కథలు