అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ సేల్ ప్రారంభమైంది. ఇటీవల ఈ మోడల్ని ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు పరిచయం చేసింది కంపెనీ. సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఇది. సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ భారీ, 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రివర్స్ ఛార్జింగ్, 64 మెగాపిక్సెల్ ఇంటెల్లీ క్యామ్, సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. 64మెగాపిక్సెల్ ఇంటెల్లీ క్యామ్‌లో 'సింగిల్ టేక్' ఫీచర్ ఉంది. కెమెరా సెటప్‌లో తొలిసారి సోనీ సెన్సార్ వాడుతోంది సాంసంగ్. సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.19,499.
Gionee: బీ రెడీ... 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో జియోనీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది
Alert: ఈ 29 యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలిట్ చేయండి
సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల ఫుల్హెచ్డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: ఎక్సినోస్ 9611
రియర్ కెమెరా: 64+12+5+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 32మెగాపిక్సెల్
బ్యాటరీ: 6,000ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+సాంసంగ్ వన్ యూఐ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ నానో
కలర్స్: మిరేజ్ బ్లూ, మిరేజ్ బ్లాక్
ధర:
6జీబీ+128జీబీ- రూ.19,499
8జీబీ+128జీబీ- రూ.21,499
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, AMAZON INDIA, Amazon prime, Samsung, Smartphone, Smartphones