• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • SAMSUNG GALAXY M31 PRIME EDITION SALE TO BEGIN DURING AMAZON GREAT INDIAN FESTIVAL SALE KNOW PRICE AND SPECIFICATIONS SS

Samsung Galaxy M31 Prime: సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ వచ్చేసింది... ధర ఎంతంటే

Samsung Galaxy M31 Prime: సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ వచ్చేసింది... ధర ఎంతంటే

Samsung Galaxy M31 Prime: సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ వచ్చేసింది... ధర ఎంతంటే (image: Amazon India)

Samsung Galaxy M31 Prime Edition | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి మార్కెట్‌లో చాలా మోడల్స్ ఉన్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్లు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లోకి సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    సాంసంగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చింది. గెలాక్సీ ఎం సిరీస్‌లో కొత్త మోడల్‌ను సాంసంగ్ పరిచయం చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ ఎడిషన్ సేల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సాంసంగ్ గెలాక్సీ ఎం31, సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ మోడల్స్ ఇండియన్ మార్కెట్లో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్‌లో వస్తున్న మరో స్మార్ట్‌ఫోన్ ఇది. ఎస్అమొలెడ్ డిస్‌ప్లే, 64మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రారంభ ధర రూ.16,499. ఈ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి మూడు నెలలు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 17న ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్స్‌కి ఈ సేల్ 24 గంటల ముందే అంటే అక్టోబర్ 16న ప్రారంభం అవుతుంది. అదే రోజున సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ సేల్ కూడా మొదలవుతుంది. ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ డిస్కౌంట్ వర్తిస్తే మరో 10 శాతం తక్కువ ధరకే ఈ ఫోన్ కొనొచ్చు.

    Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు

    Flipkart Big Billion Days: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.30,000 వరకు డిస్కౌంట్... ఫోన్ ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు

    సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఎస్అమొలెడ్ డిస్‌ప్లే
    ర్యామ్: 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: సాంసంగ్ ఎక్సినోస్ 9611
    రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా + 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ (15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + వన్ యూఐ
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: స్పేస్ బ్లాక్, ఐస్ బర్గ్ బ్లూ, ఓషియన్ బ్లూ
    ధర:
    6జీబీ+64జీబీ- రూ.16,499
    6జీబీ+128జీబీ- ధర వెల్లడించాల్సి ఉంది

    Samsung Galaxy F41: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 రిలీజ్... మొదటి సేల్‌లో కొంటే రూ.1,500 డిస్కౌంట్

    Amazon Great Indian Festival Sale: అమెజాన్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

    ఇక ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఇండియన్ డేస్ సేల్ సందర్భంగా సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది కంపెనీ. ఇటీవల రిలీజైన సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000, సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ మోడల్‌పై రూ.1,000, సాంసంగ్ గెలాక్సీ ఎం31 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000, సాంసంగ్ గెలాక్సీ ఎం21 మోడల్‌పై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు