Samsung: 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ధర ఎంతో తెలుసా?

Samsung Galaxy M30s and Samsung Galaxy M10s | సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. ఇంత భారీ బ్యాటరీతో ఇండియాలో రిలీజైన తొలి ఫోన్ ఇదే.

news18-telugu
Updated: September 18, 2019, 2:31 PM IST
Samsung: 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ధర ఎంతో తెలుసా?
Samsung: 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ధర ఎంతో తెలుసా? (image: Amazon India)
news18-telugu
Updated: September 18, 2019, 2:31 PM IST
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి సాంసంగ్ మరో రెండు మోడల్స్‌ను రిలీజ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్, సాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్ అధికారికంగా రిలీజ్ అయ్యాయి. గెలాక్సీ ఎం సిరీస్‌లో వచ్చిన రెండు కొత్త ఫోన్లు ఇవి. ఇప్పటికే రిలీజైన గెలాక్సీ ఎం30, గెలాక్సీ ఎం10 మోడల్స్‌కు అప్‌డేటెడ్ వర్షన్స్ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్స్. సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. ఇంత భారీ బ్యాటరీతో ఇండియాలో రిలీజైన తొలి ఫోన్ ఇదే. ఇప్పటివరకు రిలీజైన స్మార్ట్‌ఫోన్లల్లో 5,000 ఎంఏహెచ్ వరకు మాత్రమే బ్యాటరీ కెపాసిటీ ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 29 నుంచి సాంసంగ్ ఇ-స్టోర్‌తో పాటు అమెజాన్ ఇండియాలో కొనొచ్చు.








Loading...

























































 సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్  సాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్
  డిస్‌ప్లే  6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఇన్ఫినిటీ యూ సూపర్ అమొలెడ్  6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ సూపర్ అమొలెడ్
ర్యామ్  4జీబీ, 6జీబీ  3జీబీ
 ఇంటర్నల్ స్టోరేజ్  64జీబీ, 128జీబీ  32జీబీ
 ప్రాసెసర్  ఎక్సినోస్ 9611  ఎక్సినోస్ 7884బీ
 రియర్ కెమెరా  48+8+5 మెగాపిక్సెల్  13+5 మెగాపిక్సెల్
 ఫ్రంట్ కెమెరా  16 మెగాపిక్సెల్  8 మెగాపిక్సెల్
 బ్యాటరీ  6,000 ఎంఏహెచ్  4,000 ఎంఏహెచ్
 ఆపరేటింగ్ సిస్టమ్  ఆండ్రాయిడ్ 9 పై + వన్ యూఐ  ఆండ్రాయిడ్ 9 పై + వన్ యూఐ
 సిమ్ సపోర్ట్  డ్యూయెల్ సిమ్  డ్యూయెల్ సిమ్
 కలర్స్  ఓపల్ బ్లాక్, సాఫైర్ బ్లూ, పెరల్ వైట్  స్టోన్ బ్లూ, పియానో బ్లాక్
 ధర  4జీబీ+64జీబీ- రూ.13,999
6జీబీ+128జీబీ- రూ.16,999
 రూ.8,999

సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ 4జీబీ+64జీబీ ధర రూ.13,999, 6జీబీ+128జీబీ ధర రూ.16,999 కాగా, సాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్ 3జీబీ+32జీబీ ధర రూ.8,999. ఇవి స్పెషల్ లాంఛ్ ధరలు మాత్రమే. త్వరలో పెరిగే అవకాశముందని సాంసంగ్ చెబుతోంది.

Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Best Smartphones: ఆన్‌లైన్‌ సేల్‌లో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

Xiaomi: స్మార్ట్‌టీవీ, వాటర్ ప్యూరిఫైర్... షావోమీ నుంచి సరికొత్త స్మార్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్

Amazon Sale: సెప్టెంబర్ 29 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్... ఆఫర్లు ఇవే
First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...