SAMSUNG GALAXY M30S AND SAMSUNG GALAXY M10S SMARTPHONES RELEASED IN INDIA KNOW PRICE AND OTHER DETAILS SS
Samsung: 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ధర ఎంతో తెలుసా?
Samsung: 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ధర ఎంతో తెలుసా?
(image: Amazon India)
Samsung Galaxy M30s and Samsung Galaxy M10s | సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. ఇంత భారీ బ్యాటరీతో ఇండియాలో రిలీజైన తొలి ఫోన్ ఇదే.
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి సాంసంగ్ మరో రెండు మోడల్స్‌ను రిలీజ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్, సాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్ అధికారికంగా రిలీజ్ అయ్యాయి. గెలాక్సీ ఎం సిరీస్‌లో వచ్చిన రెండు కొత్త ఫోన్లు ఇవి. ఇప్పటికే రిలీజైన గెలాక్సీ ఎం30, గెలాక్సీ ఎం10 మోడల్స్‌కు అప్డేటెడ్ వర్షన్స్ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్స్. సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. ఇంత భారీ బ్యాటరీతో ఇండియాలో రిలీజైన తొలి ఫోన్ ఇదే. ఇప్పటివరకు రిలీజైన స్మార్ట్‌ఫోన్లల్లో 5,000 ఎంఏహెచ్ వరకు మాత్రమే బ్యాటరీ కెపాసిటీ ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 29 నుంచి సాంసంగ్ ఇ-స్టోర్‌తో పాటు అమెజాన్ ఇండియాలో కొనొచ్చు.
సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్
సాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్
డిస్ప్లే
6.4 అంగుళాల ఫుల్హెచ్డీ+ ఇన్ఫినిటీ యూ సూపర్ అమొలెడ్
6.4 అంగుళాల ఫుల్హెచ్డీ+ ఇన్ఫినిటీ వీ సూపర్ అమొలెడ్
ర్యామ్
4జీబీ, 6జీబీ
3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్
64జీబీ, 128జీబీ
32జీబీ
ప్రాసెసర్
ఎక్సినోస్ 9611
ఎక్సినోస్ 7884బీ
రియర్ కెమెరా
48+8+5 మెగాపిక్సెల్
13+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా
16 మెగాపిక్సెల్
8 మెగాపిక్సెల్
బ్యాటరీ
6,000 ఎంఏహెచ్
4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్
ఆండ్రాయిడ్ 9 పై + వన్ యూఐ
ఆండ్రాయిడ్ 9 పై + వన్ యూఐ
సిమ్ సపోర్ట్
డ్యూయెల్ సిమ్
డ్యూయెల్ సిమ్
కలర్స్
ఓపల్ బ్లాక్, సాఫైర్ బ్లూ, పెరల్ వైట్
స్టోన్ బ్లూ, పియానో బ్లాక్
ధర
4జీబీ+64జీబీ- రూ.13,999
6జీబీ+128జీబీ- రూ.16,999
రూ.8,999
సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ 4జీబీ+64జీబీ ధర రూ.13,999, 6జీబీ+128జీబీ ధర రూ.16,999 కాగా, సాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్ 3జీబీ+32జీబీ ధర రూ.8,999. ఇవి స్పెషల్ లాంఛ్ ధరలు మాత్రమే. త్వరలో పెరిగే అవకాశముందని సాంసంగ్ చెబుతోంది.
Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.