SAMSUNG GALAXY M30 | సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ-యూ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రావడం విశేషం. మార్చి 7 నుంచి అమెజాన్, సాంసంగ్ అఫీషియల్ ఆన్లైన్ స్టోర్లల్లో ఈ గెలాక్సీ ఎం30 సేల్ మొదలవుతుంది.
బడ్జెట్ ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. సాంసంగ్ నుంచి గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిగతా కంపెనీలతో పోలిస్తే కాస్త వెనకంజలో ఉన్న సాంసంగ్... తిరిగి పట్టు నిలుపుకునేందుకు ఇటీవల కొత్త ఫోన్లను వరుసగా రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 రిలీజ్ చేసిన సాంసంగ్... ఇప్పుడు ఎం30 పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. షావోమీ, రియల్మీ, ఏసుస్ లాంటి కంపెనీలకు సవాల్ విసిరింది.
సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ-యూ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రావడం విశేషం. మార్చి 7 నుంచి అమెజాన్, సాంసంగ్ అఫీషియల్ ఆన్లైన్ స్టోర్లల్లో ఈ గెలాక్సీ ఎం30 సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ కొన్నవారికి రిలయెన్స్ జియో నుంచి రూ.198, రూ.299 ప్లాన్స్‌పై డబుల్ డేటా బెనిఫిట్ లభిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా జియో సబ్స్క్రైబర్లు రూ.198 ప్లాన్ 10 రీఛార్జ్‌లపై రూ.3,100 వరకు లాభం పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.