Home /News /technology /

SAMSUNG GALAXY M30 SALE IN AMAZON ON MARCH 7TH AT 12 PM KNOW PRICE OFFERS SPECIFICATIONS AND FEATURES SS

Samsung Galaxy M30: కాసేపట్లో అమెజాన్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం30 సేల్

Samsung Galaxy M30, M20: కాసేపట్లో సాంసంగ్ గెలాక్సీ ఎం30, ఎం20 సేల్

Samsung Galaxy M30, M20: కాసేపట్లో సాంసంగ్ గెలాక్సీ ఎం30, ఎం20 సేల్

SAMSUNG GALAXY M30 | సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత.

    బడ్జెట్ సెగ్మెంట్‌లో సాంసంగ్ రిలీజ్ చేసిన గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్ సేల్ మార్చి 7న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌, సాంసంగ్ అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్లలో మొదలుకానుంది. సాంసంగ్ గతంలోనే ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. ఆ తర్వాత కాస్త హైఫై స్పెసిఫికేషన్లతో గెలాక్సీ ఎం30 రిలీజ్ చేసింది. సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ కొన్నవారికి రిలయెన్స్ జియో నుంచి రూ.198, రూ.299 ప్లాన్స్‌పై డబుల్ డేటా బెనిఫిట్ లభిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా జియో సబ్‌స్క్రైబర్లు రూ.198 ప్లాన్ 10 రీఛార్జ్‌లపై రూ.3,100 వరకు లాభం పొందొచ్చు.

    సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
    ర్యామ్: 4జీబీ, 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: ఎక్సినోస్ 7904 ఆక్టాకోర్
    రియర్ కెమెరా: 13+5+5 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
    కలర్స్: గ్రేడియేషన్ బ్లాక్, గ్రేడియేషన్ బ్లూ
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.14,990
    6జీబీ+128జీబీ- రూ.17,990


    ఇవి కూడా చదవండి:
    First published:

    Tags: Android, Samsung, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు