Samsung Galaxy M30: అమెజాన్‌లో మరోసారి సాంసంగ్ గెలాక్సీ ఎం30 సేల్

Samsung Galaxy M30 Next Sale | మొదట గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది సాంసంగ్. ఆ తర్వాత మిడ్-సెగ్మెంట్‌ని టార్గెట్ చేస్తూ హైఫై స్పెసిఫికేషన్లతో గెలాక్సీ ఎం30 రిలీజ్ చేసింది.

news18-telugu
Updated: March 18, 2019, 3:27 PM IST
Samsung Galaxy M30: అమెజాన్‌లో మరోసారి సాంసంగ్ గెలాక్సీ ఎం30 సేల్
Samsung Galaxy M30: అమెజాన్‌లో మరోసారి సాంసంగ్ గెలాక్సీ ఎం30 సేల్
news18-telugu
Updated: March 18, 2019, 3:27 PM IST
షావోమీ, రియల్‌మీ, ఏసుస్ లాంటి బ్రాండ్లకు పోటీగా బడ్జెట్‌ సెగ్మెంట్‌లో సాంసంగ్ రిలీజ్ చేసిన గెలాక్సీ ఎం30 సేల్ మరోసారి అమెజాన్‌లో మార్చి 19 మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. అమెజాన్‌తో పాటు సాంసంగ్ అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ సాంసంగ్ గెలాక్సీ ఎం30 కొనొచ్చు. ఈ ఫోన్ కంటే ముందే తక్కువ స్పెసిఫికేషన్స్‌తో గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది సాంసంగ్. ఆ తర్వాత మిడ్-సెగ్మెంట్‌ని టార్గెట్ చేస్తూ హైఫై స్పెసిఫికేషన్లతో గెలాక్సీ ఎం30 రిలీజ్ చేసింది. సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత.


సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్పెసిఫికేషన్స్


డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
Loading...
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: ఎక్సినోస్ 7904 ఆక్టాకోర్
రియర్ కెమెరా: 13+5+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
కలర్స్: గ్రేడియేషన్ బ్లాక్, గ్రేడియేషన్ బ్లూ
ధర:
4జీబీ+64జీబీ- రూ.14,990
6జీబీ+128జీబీ- రూ.17,990

Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్

ఇవి కూడా చదవండి:

Redmi 7: షావోమీ నుంచి మరో ఫోన్... చైనాలో రిలీజైన రెడ్‌మీ 7

Realme 3 Flash Sale: రియల్‌మీ 3 మరో ఫ్లాష్ సేల్... ఆఫర్లు, ఫీచర్లు ఇవే...

IRCTC Apps: ఈ ఐఆర్‌సీటీసీ యాప్స్ మీ దగ్గరున్నాయా? వాటి ఉపయోగాలు ఇవే...
First published: March 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...