Samsung-JIO offer: సాంసంగ్ గెలాక్సీ ఎం30 ఫోన్‌పై జియో నుంచి రూ.3,110 బెనిఫిట్స్

SAMSUNG GALAXY M30 | సాంసంగ్ గెలాక్సీ ఎం30 కొన్నవారికి జియో నుంచి రూ.3110 విలువైన ప్రయోజనాలు ఉన్నాయి. రూ.198, రూ.299 రీఛార్జ్ చేసుకున్నవారికే ఈ ప్రయోజనాలు లభిస్తాయి.

news18-telugu
Updated: April 10, 2019, 10:02 AM IST
Samsung-JIO offer: సాంసంగ్ గెలాక్సీ ఎం30 ఫోన్‌పై జియో నుంచి రూ.3,110 బెనిఫిట్స్
Samsung Galaxy M30: ఏప్రిల్ 11న ఫ్లాష్ సేల్... జియో నుంచి రూ.3,110 బెనిఫిట్స్
news18-telugu
Updated: April 10, 2019, 10:02 AM IST
సాంసంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం30 ఫ్లాష్ సేల్ ఏప్రిల్ 11న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో జరగనుంది. అమెజాన్‌తో పాటు సాంసంగ్ అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ కొనొచ్చు. ఫిబ్రవరి 27న లాంఛ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్‌కు బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి క్రేజ్ ఉంది. సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ మోడల్‌తో షావోమీ, రియల్‌మీ, ఏసుస్ లాంటి బ్రాండ్లకు పోటీ ఇస్తోంది సాంసంగ్. అందుకే ఫ్లాష్ సేల్స్‌లో ఈ ఫోన్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ ఫోన్ కొన్నవారికి జియో నుంచి రూ.3110 విలువైన ప్రయోజనాలు ఉన్నాయి. రూ.198, రూ.299 రీఛార్జ్ చేసుకున్నవారికే ఈ ప్రయోజనాలు లభిస్తాయి.





సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: ఎక్సినోస్ 7904 ఆక్టాకోర్
రియర్ కెమెరా: 13+5+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
కలర్స్: గ్రేడియేషన్ బ్లాక్, గ్రేడియేషన్ బ్లూ
ధర:
4జీబీ+64జీబీ- రూ.14,990
6జీబీ+128జీబీ- రూ.17,990
Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Video: ఆ కండోమ్ ప్యాకెట్ ఓపెన్ చేయాలంటే రెండు చేతులు చాలవు

IRCTC E-Wallet: ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌లో ఇలా రిజిస్టర్ చేసుకోవాలి

Honor Gala Festival: హానర్ గాలా ఫెస్టివల్‌లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు
First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...