Samsung Galaxy M22 | మరో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది సాంసంగ్. గ్లోబల్ మార్కెట్లో సాంసంగ్ గెలాక్సీ ఎం22 (Samsung Galaxy M22) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సాంసంగ్ నుంచి మరో కొత్త ఫోన్ విడుదలైంది. సాంసంగ్ గెలాక్సీ M22 (Samsung Galaxy M22) స్మార్ట్‌ఫోన్ అధికారికంగా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌ను సాంసంగ్ (Samsung) జర్మనీ వెబ్సైట్లో లిస్ట్ చేసింది. వెబ్సైట్లో దీని స్పెసిఫికేషన్లను పేర్కొన్నప్పటికీ.. ధర మాత్రం వెల్లడించలేదు. ఈ హ్యాండ్సెట్ డిస్ప్లే సైజు, కెమెరాలు, చిప్సెట్, ఇతర అన్ని ఫీచర్లను వెబ్సైట్ ద్వారా పంచుకుంటుంది. ఇందులో సెల్ఫీ స్నాపర్ కోసం వాటర్‌డ్రాప్ నాచ్, వెనుకవైపు చదరపు ఆకారంలో నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా చేర్చనుంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం22 ధర, కలర్స్
గెలాక్సీ M22 ధరను సాంసంగ్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఫోన్ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇది బ్లాక్, లైట్ బ్లూ, వైట్ మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి జర్మన్ మార్కెట్లోనే లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలోనే భారత్‌లోకి రానుంది. ఈ ఫీచర్లను బట్టి చూస్తే బడ్జెట్ ధరలోనే దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం22 6.4 అంగుళాల హెచ్డీ ప్లస్ sAMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 1600 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. సెల్ఫీ స్నాపర్ కోసం దీనిలో వాటర్‌డ్రాప్ నాచ్ని అందించింది. ఈ ఫోన్‌కి మీడియాటెక్ హెలియో G80 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. మైక్రో ఎస్డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్‌ను మరింత విస్తరించుకోవచ్చు. ఇది OneUI 3.1 కస్టమ్ స్కిన్ ఆధారిత ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై రన్ అవుతుంది.
ఇందులో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్- సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను సాంసంగ్ అందించింది. దీని వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో 48MP ప్రైమరీ కెమెరా, 8MP వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ కెమెరా, 2MP మాక్రో లెన్స్ కెమెరాలను అందించింది. సెల్ఫీలు, వీడియో చాట్ల కోసం ప్రత్యేకంగా దీని ముందు భాగంలో 13MP స్నాపర్ కెమెరాను చేర్చింది. ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.