Samsung Galaxy M21: భారత్‌లో విడుదలైన శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21.. ధర, ఫీచర్ల వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ కొత్తగా గెలాక్సీ ఎం21 మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోన్, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
స్మార్ట్ ఫోన్ రంగానికి భారత్ అతి పెద్ద మార్కెట్‌గా మారుతోంది. అందుకే ప్రతి వారం ఏదో ఒక కంపెనీ కొత్త ఫోన్లను విడుదల చేస్తూనే ఉంటుంది. తాజాగా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ కొత్తగా గెలాక్సీ ఎం21 మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గెలాక్సీ ఎం సిరీస్‌లో కొత్త ఎడిషన్ బడ్జెట్ ఫోన్లను ఇష్టపడేవారి కోసం సరైన ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఇందులో కెమెరా విభాగంలో మంచి అప్ డేట్లను అందించిందీ సంస్థ. పూర్తి డిజైన్‌ను అలాగే ఉంచి బ్యాటరీ 6000ఎంఏహెచ్‌గా మార్చింది. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలను గమనిస్తే..  శామ్‌సంగ్ సంస్థ గెలాక్సీ ఎం21 తాజా 2021 ఎడిషన్ ధర రూ.12,499గా నిర్ణయించింది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 14,499 గా నిర్ణయించింది శామ్‌సంగ్. ఈ ఫోన్ ప్రస్తుతం ఆర్కిటిక్ బ్లూ, చార్ కోల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. జులై 21 నుంచి ఈ ఫోన్ అమెజాన్, శామ్‌సంగ్ వెబ్ సైట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు కొన్ని రిటైల్ స్టోర్లలో కూడా ఈ మోడల్‌ అమ్మకానికి ఉంటుందని సంస్థ ప్రకటించింది.
ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు బంపరాఫర్.. రూ. 900 డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ.. ఆఫర్ కొన్ని రోజులే..

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి గెలాక్సీ ఎమ్21 ఫోన్‌ను కొనుగోలు చేసేవారు రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. దీన్ని కొన్ని రోజుల పాటు అందించనున్నారు. ఈ ఫోన్ లో సూపర్ AMOLED 6.4 అంగుళా ఫుల్ హెచ్ డీ, ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే ఉంది. దీంతో పాటు 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, జీఎం2 సెన్సార్ ఉన్నాయి. వీటితో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 123 డిగ్రీ ఫీల్డ్ వ్యూ కూడా ఉన్నాయి. 5 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా అద్భుతమైన పొట్రెయిట్ షాట్స్ తీయడానికి ఉపయోగపడుతుంది.

వీటితో పాటు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇతర అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులో ఉంది. సెల్ఫీల కోసం అద్భుతమైన కెమెరా మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ లో ఈక్సినాస్ 9611 చిప్ సెట్ ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో అందుబాటులో ఉన్న కొత్త డివైజ్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. పదిహేను వాట్ల ఛార్జర్‌ను కూడా జతగా అందిస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published: