సాంసంగ్ గతేడాది మార్చిలో సాంసంగ్ గెలాక్సీ ఎం21 స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్గా సాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్‌ను పరిచయం చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం21 స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని మార్పులు చేసి లేటెస్ట్ మోడల్ పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే, ఎక్సినోస్ 9611 ప్రాసెసర్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 48మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 స్మార్ట్‌ఫోన్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.14,499. సాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 మోడల్‌ను జూలై 26న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కొనొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
Want an FHD+ sAMOLED Display that lets you binge on and on? Done. Want a Monster 6000mAh Battery? You got it. Want a True 48MP Cam, instead of a Normal 48MP one? Check.
సాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆర్టిక్ బ్లూ, చార్కోల్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. సాంసంగ్ గతేడాది రిలీజ్ చేసిన గెలాక్సీ ఎం21 మోడల్, గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్ మధ్య ఉన్న తేడాలు ఇక్కడ తెలుసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.