దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ కంపెనీ అయిన సాంసంగ్ సైలెంట్‌గా ఓ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. గెలాక్సీ ఎం సిరీస్‌లో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. రూ.10,000 బడ్జెట్లో సాంసంగ్ గెలాక్సీ ఎం13 (Samsung Galaxy M13) మొబైల్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఎక్సినోస్ 850 ప్రాసెసర్ (Exynos 850 Processor) లాంటి ప్రత్యేకతలున్నాయి. సాంసంగ్ ఇండియాలో గతేడాది గెలాక్సీ ఎం12 స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్ అప్‌గ్రేడ్ వేరియంట్ సాంసంగ్ గెలాక్సీ ఎం13 మోడల్‌ను ఇప్పుడు తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.10,999 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫర్‌తో రూ.10,000 లోపే ఈ మొబైల్ లభించే అవకాశం ఉంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం13 ఎన్ని వేరియంట్లలో లభించనుందన్న విషయం తెలియాల్సి ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఇన్ఫినిటీ వీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ సాంసంగ్ గెలాక్సీ ఎం12, సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ మోడల్స్‌లో కూడా ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
Jio Offer: గుడ్ న్యూస్... ఈ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి రూ.7,200 విలువైన బెనిఫిట్స్
సాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 5మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + వన్‌యూఐ కోర్ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ సపోర్ట్ ఉండటం విశేషం. 4జీ ఎల్టీఈ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, బ్లూటూత్ 5.0, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. డీప్ గ్రీన్, లైట్ బ్లూ, ఆరెంజ్ కాపర్ కలర్స్‌లో కొనొచ్చు.
WhatsApp Hijack: మీ వాట్సప్ అకౌంట్‌ని సింపుల్‌గా హైజాక్ చేసేస్తారు... ఎలాగో తెలుసా?
ఇండియాలో ప్రస్తుతం రూ.10,000 లోపు బడ్జెట్లో రియల్మీ నార్జో 50ఐ, రెడ్మీ 9ఏ స్పోర్ట్, రియల్మీ సీ31, రెడ్మీ 10ఏ , రెడ్మీ 10 ఇన్ఫీనిక్స్ హాట్ 11 2022 మోడల్స్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్‌ఫోన్ రూ.10,000 లోపు రిలీజైతే ఈ మోడల్స్‌కు గట్టి పోటీ ఇస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, Mobiles, Samsung, Samsung Galaxy, Smartphone