Home /News /technology /

SAMSUNG GALAXY M13 GALAXY M13 5G LAUNCHED STARTING AT RS 11999 UMG GH

Samsung: సామ్‌సంగ్ బడ్జెట్ మొబైల్ లాంచ్.. గెలాక్సీ M13 ఫీచర్లు ఇవే..!

సామ్‌సంగ్ మొబైల్

సామ్‌సంగ్ మొబైల్

శామ్‌సంగ్ M సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ M13 5G (Galaxy M13 5G), గెలాక్సీ M13 (Galaxy M13) తాజాగా లాంచ్ అయ్యాయి. వీటిలో 5G డివైజ్‌ కొత్త తరం కనెక్టివిటీ నెట్‌వర్క్ అయిన 5G టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తుంది. ఇది ఏకంగా పదకొండు 5G బ్యాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది.

ఇంకా చదవండి ...
గ్లోబల్ టెక్ దిగ్గజం, స్మార్ట్‌బ్రాండ్ సామ్‌సంగ్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై ఫోకస్ పెట్టింది. తాజాగా కంపెనీ మరో రెండు స్మార్ట్‌ఫోన్లను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. శామ్‌సంగ్ M సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ M13 5G (Galaxy M13 5G), గెలాక్సీ M13 (Galaxy M13) తాజాగా లాంచ్ అయ్యాయి. వీటిలో 5G డివైజ్‌ కొత్త తరం కనెక్టివిటీ నెట్‌వర్క్ అయిన 5G టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తుంది. ఇది ఏకంగా పదకొండు 5G బ్యాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది. మరో డివైజ్ 4G కనెక్టివిటీకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

* ధర ఎంత?
సామ్‌సంగ్ గెలాక్సీ M13 5G ఫోన్ 4GB+64GB వేరియంట్‌ ధర రూ.13,999 కాగా, 6GB+128GB వేరియంట్‌ ధర రూ. 15,999గా ఉంది. గెలాక్సీ M13 4జీ ఫోన్ 4GB+64GB వేరియంట్‌ ధర రూ.11,999 కాగా, 4GB+64GB వేరియంట్‌ ధర రూ.13,999గా ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మైక్రో SD కార్డ్‌లకు సపోర్ట్ చేస్తాయి. వీటిద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్లు ఆక్వా గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ, స్టార్‌డస్ట్ బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

ఈ డివైజ్‌లపై లాంచింగ్ ఆఫర్లు ఉన్నాయి. ICICI బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. గెలాక్సీ M13 5G, గెలాక్సీ M13 ఫోన్లు జులై 23 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ పోర్టల్, Samsung.com, ఇతర రిటైల్ స్టోర్‌లలో లభిస్తాయి.

 ఇదీ చదవండి:  కన్నీళ్లు తెప్పించే వార్త.. వర్షంలో నట్టడివిలో నడుస్తూ.. కూతురి శవంతో నాలుగు కిలోమీటర్లు.. ఆ తండ్రి బాధ వర్ణణాతీతం


* గెలాక్సీ M13 5G స్పెసిఫికేషన్లు
సామ్‌సంగ్ గెలాక్సీ M13 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 2.2GHz వరకు క్లాక్ చేయగలదు. రెండు స్మార్ట్‌ఫోన్‌లు RAM ప్లస్ అనే వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో 12GB RAM వరకు సపోర్ట్ చేస్తాయి. గెలాక్సీ M13 5G ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 50MP+2MP డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 5MP ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లతో బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

గెలాక్సీ M13 స్మార్ట్‌ఫోన్‌ యూనిక్ ఆటో డేటా స్విచింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఈ ఫీచర్‌తో ప్రైమరీ SIM నెట్‌వర్క్ లేని ప్రాంతంలో ఉన్నప్పటికీ, వినియోగదారులు సెకండరీ SIM డేటాను ఉపయోగించి కాల్స్ చేయవచ్చు లేదా స్వీకరించవచ్చు. గెలాక్సీ M13 5G ఫోన్ 15W ఛార్జింగ్‌తో, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 బేస్డ్ One UI కోర్ 4 ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతుంది.



* గెలాక్సీ M13 స్పెసిఫికేషన్లు
4G నెట్‌వర్క్ సపోర్ట్‌తో లాంచ్ అయిన గెలాక్సీ M13 ఫోన్ Exynos 850 చిప్‌సెట్‌తో పాటు 6.6-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 50MP+5MP (UW-123 FOV)+2MP (డెప్త్) రియర్ కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 బేస్డ్ One UI కోర్ 4 ఇంటర్‌ఫేస్‌తో నడుస్తుంది. 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 mAh బ్యాటరీ దీని సొంతం.
Published by:Mahesh
First published:

Tags: 5g mobile, Samsung, Samsung Galaxy, Smart phone

తదుపరి వార్తలు