హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung Galaxy M13: సాంసంగ్ నుంచి రెండు కొత్త మొబైల్స్... 12GB ర్యామ్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా

Samsung Galaxy M13: సాంసంగ్ నుంచి రెండు కొత్త మొబైల్స్... 12GB ర్యామ్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా

Samsung Galaxy M13: సాంసంగ్ నుంచి రెండు కొత్త మొబైల్స్... 12GB ర్యామ్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
(image: Samsung India)

Samsung Galaxy M13: సాంసంగ్ నుంచి రెండు కొత్త మొబైల్స్... 12GB ర్యామ్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా (image: Samsung India)

Samsung Galaxy M13 | సాంసంగ్ నుంచి గెలాక్సీ ఎం సిరీస్‌లో రెండు స్మార్ట్‌పోన్లు ఇండియాలో లాంఛ్ అయ్యాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ, సాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ (Samsung Galaxy M13 5G) మొబైల్స్ రూ.15,000 లోపే వచ్చాయి.

సాంసంగ్ ఇండియా మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ని ఇండియాలో లాంఛ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం13 సిరీస్‌లో (Samsung Galaxy M13 Series) రెండు మోడల్స్ లాంఛ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం13, సాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ మోడల్‌లో 11 5జీ బ్యాండ్స్ సపోర్ట్, ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 12జీబీ వరకు ర్యామ్ లాంటి ఫీచర్స్ ఉంటే సాంసంగ్ గెలాక్సీ ఎం13 ఎల్‌టీఈ మోడల్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. జూలై 23న అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) సందర్భంగా సాంసంగ్ గెలాక్సీ 13 స్మార్ట్‌ఫోన్ల సేల్ ప్రారంభం అవుతుంది. సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా కొనొచ్చు.

సాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ ఫీచర్స్


సాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ మోడల్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఆక్వా గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ, స్టార్‌డస్ట్ బ్రౌన్ కలర్స్‌లో కొనొచ్చు.

Samsung Price Cut: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గించిన సాంసంగ్... 8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీ, 48MP కెమెరా

సాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 11 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 12 + వన్‌యూఐ కోర్ 4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

సాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆటో డేటా స్విచింగ్ ఫీచర్ ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 12జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. నాక్స్ సెక్యూరిటీ ఫీచర్ కూడా ఉంది.

Nothing vs OnePlus: నథింగ్ ఫోన్ 1, వన్‌ప్లస్ నార్డ్ 2టీ... ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

సాంసంగ్ గెలాక్సీ ఎం13 ఫీచర్స్


సాంసంగ్ గెలాక్సీ ఎం13 మోడల్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఆక్వా గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ, స్టార్‌డస్ట్ బ్రౌన్ కలర్స్‌లో కొనొచ్చు.

సాంసంగ్ గెలాక్సీ ఎం13 ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + వన్‌యూఐ కోర్ 4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

సాంసంగ్ గెలాక్సీ ఎం13 కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆటో డేటా స్విచింగ్ ఫీచర్ ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 12జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. నాక్స్ సెక్యూరిటీ ఫీచర్ కూడా ఉంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Samsung, Samsung Galaxy, Smartphone

ఉత్తమ కథలు