• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • SAMSUNG GALAXY M12 SMARTPHONE RELEASED WITH EXYNOS 850 PROCESSOR 6000MAH BATTERY KNOW PRICE AND SPECIFICATIONS SS

Samsung Galaxy M12: భారీ బ్యాటరీతో రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం12... ఫీచర్స్, ఆఫర్స్ వివరాలివే

Samsung Galaxy M12: భారీ బ్యాటరీతో రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం12... ఫీచర్స్, ఆఫర్స్ వివరాలివే

Samsung Galaxy M12 | సాంసంగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. సాంసంగ్ గెలాక్సీ ఎం12 ప్రత్యేకతలు, ఫీచర్స్, ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో మోడల్ రిలీజ్ అయింది. సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో గెలాక్సీ ఎం12 మోడల్‌ను పరిచయం చేసింది. ఇందులో సాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. 4జీబీ+64జీబీ ధర రూ.10,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,499. మార్చి 18న అమెజాన్, సాంసంగ్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు రీటైల్ స్టోర్లలో సేల్ మొదలవుతుంది. లాంఛింగ్ ఆఫర్స్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.1,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

    సాంసంగ్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రియల్‌మీ నార్జో 30ఏ, రెడ్‌మీ నోట్ 10, పోకో ఎం3 లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

    WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మీ ఛాట్స్‌కి పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు

    Exchange Offer: మీ పాత ఫోన్ ఇచ్చి రూ.549 చెల్లించి ఈ ఫోన్ తీసుకోవచ్చు


    సాంసంగ్ గెలాక్సీ ఎం12 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+ టీఎఫ్‌టీ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే
    ర్యామ్: 4జీబీ, 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: సాంసంగ్ ఎక్సినోస్ 850
    రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ సెకండరీ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 6,000ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1 కోర్
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: అట్రాక్టీవ్ బ్లాక్, ఎలిగెంట్ బ్లూ, ట్రెండీ ఎమరాల్డ్ గ్రీన్
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.10,999
    6జీబీ+128జీబీ- రూ.13,499
    Published by:Santhosh Kumar S
    First published: