సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. సాంసంగ్ గెలాక్సీ ఎం01, గెలాక్సీ ఎం11 స్మార్ట్ఫోన్ల ధరల్ని తగ్గించింది కంపెనీ. ఈ రెండు స్మార్ట్ఫోన్లు జూన్‌లో రిలీజ్ అయ్యాయి. అప్పట్నుంచి రెండుసార్లు ధర తగ్గడం విశేషం. దీంతో ఈ స్మార్ట్ఫోన్లు లాంఛింగ్ ధర కన్నా తక్కువకే లభిస్తున్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం11 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్‌పై రూ.500 తగ్గింది. దీంతో ధర రూ.11,499 నుంచి రూ.10,999 ధరకు తగ్గింది. ఇక 4జీబీ+64జీబీ వేరియంట్‌పై రూ.1,000 తగ్గింది. దీంతో ధర రూ.12,999 నుంచి రూ.11,999 ధరకు తగ్గింది. ఇక సాంసంగ్ గెలాక్సీ ఎం01 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్‌పై రూ.400 తగ్గింది. దీంతో ధర రూ.8,399 నుంచి రూ.7,999 ధరకు తగ్గింది. ఈ స్మార్ట్ఫోన్లను అమెజాన్ ఇండియాతో పాటు సాంసంగ్ అధికారిక ఇ-స్టోర్‌లో కొనొచ్చు.
Poco X3: ఈరోజే పోకో ఎక్స్3 ఫస్ట్ సేల్... డిస్కౌంట్‌తో కొనండి ఇలా
Android Apps: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... ఈ 17 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి
సాంసంగ్ గెలాక్సీ ఎం11 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఉంది. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో రిలీజైంది. మైక్రోఎస్డీ కార్డుతో స్టోరేజీ పెంచుకోవచ్చు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13+5+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం11 మెటాలిక్ బ్లూ, బ్లాక్, వయొలెట్ కలర్స్‌లో కొనొచ్చు. ప్రస్తుతం 3జీబీ+32జీబీ ధర రూ.10,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.11,999.
Realme Narzo 20: కాసేపట్లో రియల్మీ నార్జో 20 సేల్... ఆఫర్స్ ఇవే
ఇక సాంసంగ్ గెలాక్సీ ఎం01 స్పెసిఫికేషన్స్ చూస్తే 5.71 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ వీ డిస్ప్లే ఉంది. 3జీబీ+32జీబీ వేరియంట్‌తో మాత్రమే లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డుతో స్టోరేజీ పెంచుకోవచ్చు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. బ్యాటరీ కెపాసిటీ 4000ఎంఏహెచ్ మాత్రమే. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎం01 బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్‌లో కొనొచ్చు. ప్రస్తుతం 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,999.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AMAZON INDIA, Android 10, Samsung, Smartphone