Home /News /technology /

SAMSUNG GALAXY M10 GALAXY M20 SALE STARTS IN AMAZON AND SAMSUNG WEBSITE KNOW OFFERS ALL DETAILS FEATURES SPECIFICATIONS SS

Samsung Galaxy M10, M20: అమెజాన్‌ సాంసంగ్ గెలాక్సీ ఎం10, ఎం20 సేల్... ఆఫర్లు ఇవే

Samsung Galaxy M10, M20 Sale | సాంసంగ్ గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్ల సేల్ అమెజాన్‌లో ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారికి 5% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy M10, M20 Sale | సాంసంగ్ గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్ల సేల్ అమెజాన్‌లో ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారికి 5% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy M10, M20 Sale | సాంసంగ్ గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్ల సేల్ అమెజాన్‌లో ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారికి 5% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

    బడ్జెట్ సెగ్మెంట్‌పై కన్నేసిన సాంసంగ్... షావోమీ, ఏసుస్, రియల్‌మీ లాంటి కంపెనీలకు గట్టిపోటీ ఇచ్చేందుకు ఇటీవల గెలాక్సీ ఎం10, ఎం20 ఫోన్లను రిలీజ్ చేసింది సాంసంగ్. గతంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సాంసంగ్‌కు మంచి పట్టు ఉండేది. కానీ... ఇతర కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురైంది. మళ్లీ పూర్వవైభవం పొందేందుకు గెలాక్సీ ఎం10, ఎం20 ఫోన్లను రిలీజ్ చేసింది సాంసంగ్. 'ఇన్ఫినిటీ-వీ' పేరుతో తొలిసారిగా నాచ్ డిస్‌ప్లేతో సాంసంగ్ రూపొందించిన ఫోన్లు ఇవి. సాంసంగ్ గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్ల సేల్ అమెజాన్‌లో ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారికి 5% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ ఫోన్లు కొనొచ్చు. రిలయెన్స్ జియోలో రూ.198, రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జులపై డబుల్ డేటాతో పాటు, రూ.3,110 వరకు లాభాలు ఉంటాయి.

    Read this: Xiaomi Redmi Note 7: ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ కెమెరా... ఆకట్టుకుంటున్న రెడ్‌మీ నోట్ 7

    సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్పెసిఫికేషన్స్


    సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్ 6.2 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. 2జీబీ+16జీబీ, 3జీబీ+32జీబీ వేరియంట్లలో ఉందీ ఫోన్. ప్రాసెసర్ ఎక్సినోస్ 7870. రియర్ కెమెరా 13+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,400 ఎంఏహెచ్. ఓషియన్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది ఈ ఫోన్. ఇక ధర విషయానికొస్తే 2జీబీ+16జీబీ ధర రూ.7,990, 3జీబీ+32జీబీ ధర రూ.8,990.

    Read this: SBI Offer: హోమ్‌ లోన్‌పై జీరో ప్రాసెసింగ్ ఫీజ్... ఫిబ్రవరి 28 వరకే అవకాశం

    సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్పెసిఫికేషన్స్


    సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లతో ఉన్న ఈ ఫోన్ ప్రాసెసర్ ఎక్సినోస్ 7904. రియర్ కెమెరా 13+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం విశేషం. ఈ ఫోన్ కూడా ఓషియన్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. 3జీబీ+32జీబీ ధర రూ.10,990, 4జీబీ+64జీబీ ధర రూ.12,990.

    Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


    ఇవి కూడా చదవండి:

    Railway Jobs: 1,30,000 రైల్వే ఉద్యోగాలకు ఆర్ఆర్‌బీ ప్రకటన

    NPCI Contest: క్రియేటీవ్‌గా ట్వీట్ చేస్తే రూ.5 లక్షల బహుమతి

    LIC Micro Bachat: ఎల్ఐసీ నుంచి 'మైక్రో బచత్ ప్లాన్'... వివరాలివే
    First published:

    Tags: AMAZON INDIA, Android, Samsung, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు