సాంసంగ్ ఇండియా నుంచి మరో కొత్త మొబైల్ ఇండియాలో లాంఛ్ అయింది. సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం04 (Samsung Galaxy M04) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. ఈ మొబైల్ రూ.10,000 లోపు బడ్జెట్లో (Smartphone Under Rs 10000) రిలీజ్ కావడం విశేషం. ఇందులో 6.5 అంగుళాల డిస్ప్లే, 8జీబీ వరకు ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్, 5,000mAh బ్యాటరీ, 13మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. గతంలో రిలీజైన సాంసంగ్ గెలాక్సీ ఎం03 అప్‌గ్రేడ్ వర్షన్‌గా సాంసంగ్ గెలాక్సీ ఎం04 వచ్చింది. బేసిక్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.
సాంసంగ్ గెలాక్సీ ఎం04 కేవలం ఒకే వేరియంట్లో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499. బ్యాంకు ఆఫర్స్ వెల్లడించాల్సి ఉంది. డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో సేల్ ప్రారంభం అవుతుంది. మింట్ గ్రీన్, గోల్డ్, వైట్, బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
iPhone Offer: ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు... రూ.17,499 ధరకే ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు
సాంసంగ్ గెలాక్సీ ఎం04 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బేసిక్ యూసేజ్ కోసం ఈ ప్రాసెసర్ పనితీరు సరిపోతుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 8జీబీ వరకు ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. మెమొరీ కార్డుతో 128జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
సాంసంగ్ గెలాక్సీ ఎం04 కెమెరా ఫీచర్స్ చూస్తే 13+2 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉండగా, 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 12 + వన్‌యూఐ 4.1 కోర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సాంసంగ్ రెండేళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని ప్రకటించింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఉంది. 4జీ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
Jio New Plan: జియో కొత్త ప్లాన్... ఒక్క రీఛార్జ్‌తో 50జీబీ డేటా
సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో రూ.10,000 లోపు సాంసంగ్ గెలాక్సీ ఎం13 మోడల్ కూడా ఉంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎక్సినోస్ 850 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samsung, Samsung Galaxy, Smartphone