కొత్త సంవత్సరంలో మొదటి స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది సాంసంగ్. రూ.10,000 లోపు బడ్జెట్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్ కొద్దిరోజుల క్రితం నేపాల్‌లో లాంఛ్ అయింది. ఇప్పుడు ఇండియాలో రిలీజైంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇందులో 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఐఎస్ఓ కంట్రోల్, ఆటో ఫ్లాష్, డిజిటల్ జూమ్, హెచ్‌డీఆర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. అమెజాన్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో సేల్ ప్రారంభం కానుంది. సేల్ ఏ రోజున మొదలవుతుందో సాంసంగ్ ఇంకా ప్రకటించలేదు.
Samsung Big TV Days: సాంసంగ్ టీవీ కొంటే స్మార్ట్‌ఫోన్ ఫ్రీ... క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కూడా
Lava Smartphones: నాలుగు మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేసిన లావా మొబైల్స్
సాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + సాంసంగ్ వన్ యూఐ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, బ్లూ, రెడ్
ధర:
3జీబీ+32జీబీ- రూ.8,999
4జీబీ+64జీబీ- రూ.9,999
Mi 10i vs OnePlus Nord vs Moto g 5g: ఈ మూడు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి
POCO Smartphones: ఈ 4 స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన పోకో ఇండియా... లేటెస్ట్ రేట్స్ ఇవే
ఇప్పటికే రూ.10,000 లోపు బడ్జెట్‌లో ఉన్న రెడ్‌మీ 9 ప్రైమ్, పోకో ఎం2, రియల్‌మీ నార్జో 20ఏ లాంటి మోడల్స్‌కు సాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ స్మార్ట్‌ఫోన్‌తో పోటీ తప్పదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile, Mobile News, Mobiles, Samsung, Smartphone, Smartphones