సాంసంగ్ గెలక్సీ M02కు మార్కెట్లో మంచి బజ్ వచ్చింది. దీంతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది సాంసంగ్ కంపెనీ. సాంసంగ్ గెలాక్సీ M02 స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 2న ఇండియాలో లాంఛ్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటన చేసింది. ఈమేరకు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వెబ్ సైట్లో బ్యానర్ పెట్టింది. దీంతో ఈ ఫోన్ విడుదలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. మరోవైపు దీని ధర కూడా చాలా తక్కువగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం 6,000-7,000 రూపాయల లోపే ఈ గాలక్సీ M02 ధరలుండటం సామ్ సంగ్ ప్రియులను ఆకట్టుకునే విషయం. 'Notify me' అనే పేజ్ లో క్లిక్ చేస్తే మీకు ఈ ఫోన్ పై తాజా అప్డేట్స్ కనిపిస్తాయి.
సాంసంగ్ గాలక్సీ M02 ఫీచర్లను ఒక్కొక్కటే రివీల్ చేస్తున్న సంస్థ చెబుతున్న వివరాలు ఆసక్తికలిగించేలా ఉన్నాయి. 6.5 అంగుళాల HD+ డిస్ప్లేతో పాటు 5000mAh బ్యాటరీతో ఈ గ్యాడ్జెట్ మంచి బ్యాకప్ ఇచ్చేలా తయారు చేశారు. ఇటీవలే లాంచ్ అయిన సామ్ సంగ్ గాలక్సీ M02s వేరియంటే కాగా, దీని ధర మాత్రం రూ. 8,999గా ఉంది. ఈ హ్యాండ్ సెట్ 6.5 అంగుళాల హ్యాండ్ సెట్‌కు స్నాప్‌డ్రాగన్ 450 SoC సపోర్ట్ ఉండటం విశేషం. Samsung One Ui ఆండ్రాయిడ్ 10తో నడిచే డివైజ్‌కు ట్రిపుల్ రేర్ కెమరా సెటప్ తో ఉండగా 13MP సెన్సార్ తో ఇవి ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమరా విషయానికి వస్తే 5 MP కెమరా సెన్సార్ తో ఇది పనిచేస్తుంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం02 స్మార్ట్‌ఫోన్‌లో 13MP+2MP కెమరాలుంటాయి. డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, టచ్ టు ఫోకస్ వంటి ఫీచర్లు ఉండే ఈ హ్యాండ్ సెట్ కు 4G సపోర్టింగ్ సిస్టం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.