ఎంట్రీలెవెల్ సెగ్మెంట్లో సాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం01 కోర్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. ఇప్పటికే ఎం01 సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం01, సాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు సాంసంగ్ గెలాక్సీ ఎం01 కోర్ రిలీజ్ చేసింది కంపెనీ. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్లో యాప్స్ అన్నీ చాలా తక్కువ సైజ్‌లో ఉంటాయి. రెండు వేరియంట్లలో సాంసంగ్ గెలాక్సీ ఎం01 కోర్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ప్రారంభ ధర రూ.5,499 మాత్రమే. జూలై 29 నుంచి సాంసంగ్ ఆఫ్‌లైన్, ఆన్లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారి కోసం తక్కువ బడ్జెట్లో ఈ మోడల్‌ను పరిచయం చేసింది సాంసంగ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.