స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ (Samsung) కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ M స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను కొత్త శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్53 5జీ (Samsung Galaxy M53 5G)తో రిఫ్రెష్ చేసింది. కొత్త డివైజ్ గత సంవత్సరం చివర్లో వచ్చిన గెలాక్సీ M52 5G వేరియంట్‌కు సక్సెసర్‌గా వచ్చింది. ఇది వన్‌ప్లస్ నార్డ్2 (OnePlus Nord 2) వంటి మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా ఇది చాలా కొత్త ఫీచర్ల (New Feautures)తో వస్తుంది. కొత్త గెలాక్సీ M53 5G ఫోన్ MediaTek చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoCతో పనిచేస్తుంది. కొత్త శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఆకట్టుకుంటుంది. అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోవడం ఒక లోటుగా చెప్పవచ్చు. ఇది 7.4mm మందంతో, స్లిమ్ డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
* ధర ఎంత?
గెలాక్సీ M53 5G ఫోన్ రెండు మెమరీ వేరియంట్‌లలో (Variants) లభిస్తుంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,999. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMI ట్రాన్సాక్షన్స్‌పై రూ. 2,500 డిస్కౌంట్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ డీప్ ఓషన్ బ్లూ (Deep Ocean Blue), మిస్టిక్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. దీని సేల్ ఏప్రిల్ 29న శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో ప్రారంభమవుతుంది.
* స్పెసిఫికేషన్లు
గెలాక్సీ M53 5G 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,400 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-O సూపర్ AMOLED+ డిస్‌ప్లే (Display)తో వస్తుంది. 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ దీని సొంతం. ఇది 25W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది కానీ.. దీని ప్యాకేజీలో ఛార్జింగ్ అడాప్టర్ లేదు. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా అందిస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. దీంట్లో ఉండే మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC చిప్‌సెట్ (Chipset) మంచి పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 8GB వరకు ఖాళీ స్టోరేజ్‌ను ఉపయోగించుకునే 'RAM Plus' టెక్నాలజీతో దీని RAM కెపాసిటీని పెంచుకోవచ్చు.
Honda Bike: హోండా నుంచి ప్రీమియం బైక్ లాంచ్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
గెలాక్సీ M53 5G ఫోన్‌లో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీంట్లో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, డెప్త్ సెన్సింగ్, మాక్రో ఫోటోగ్రఫీ కోసం రెండు 2-మెగాపిక్సెల్ సెన్సార్లు (Megapixel sensors) కూడా ఉన్నాయి. ముందుభాగంలో హోల్-పంచ్ కటౌట్‌కు బదులుగా 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఫోన్ రిలీజ్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, New feature, New mobiles, Samsung Galaxy