• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • SAMSUNG GALAXY F62 SALE BEGINS KNOW PRICE SPECIFICATIONS AND OFFERS SS GH

Samsung Galaxy F62: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్స్ ఇవే

Samsung Galaxy F62: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్స్ ఇవే

Samsung Galaxy F62: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్స్ ఇవే (image: Samsung India)

Samsung Galaxy F62 | సాంసంగ్ ఇటీవల గెలాక్సీ ఎఫ్62 రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సేల్ మొదలైంది. ఆఫర్ల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎఫ్- సిరీస్ లో మరో స్మార్ట్‌ఫోన్ ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ ఎఫ్ 62 పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలను ఫ్లిప్‌కార్ట్, సాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్ల ద్వారా ప్రారంభించింది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62 బ్లూ, లాస్ట్ గ్రీన్, లేజర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీని బేస్ వేరియంట్ 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది. ఇది రూ.23,999లకు అందుబాటులో ఉంటుంది. కాగా, 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ రూ .25,999లకు లభిస్తుంది. రిలయన్స్ డిజిటల్ లేదా మై జియో స్టోర్లలో ఈ ఫోను కొనుగోలుపై తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. జియో కస్టమర్లకు రూ.3,000 విలువ చేసే రీఛార్జ్ కూపన్లతో పాటు రూ .7,000 విలువైన రిలయన్స్ భాగస్వామి బ్రాండ్ కూపన్లు లభిస్తాయి.

Redmi 9 Power: రెడ్‌మీ 9 పవర్ కొత్త వేరియంట్ వచ్చేసింది... ధర ఎంతంటే

Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్... ఈ 25 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

వినియోగదారులు ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ .2,500 తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62 కూడా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రాం కిందకు  వస్తుంది. ఈ ప్రోగ్రాం కింద వినియోగదారులు దీని అసలు ధరలో 70 శాతం చెల్లించి స్మార్ట్ ఫోను దక్కించుకోవచ్చు. ఏడాది తర్వాత వినియోగదారులు కొత్త గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు దీన్ని అప్‌గ్రేడ్ చేయవచ్చు, లేదా దీన్ని తిరిగి ఇవ్వవచ్చు. అంతేకాక, మిగిలిన 30 శాతం చెల్లించి స్మార్ట్ ఫోన్ ని  తమ వద్దే ఉంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ -గ్రేడ్ ఎక్సినోస్ 9825 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో  పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో డ్యూయల్ సిమ్ సపోర్ట్‌, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

Realme Narzo 30 Pro: రియల్‌మీ సంచలనం... తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... రియల్‌మీ నార్జో 30 ప్రో ఫీచర్స్ ఇవే

Exchange Offer: రూ.10,999 విలువైన స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.649 ధరకే సొంతం చేసుకోండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే

సాంసంగ్ ఎఫ్ 62 స్మార్ట్ ఫోన్ లో f/1.8  ఎపర్చర్‌తో కూడిన 64 ఎంపి ప్రైమరీ సెన్సార్‌ కెమెరా, f/2.2 ఎపర్చర్‌తో కూడిన 12 ఎంపి క్వాడ్-రియర్ కెమెరా, 123 డిగ్రీల అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, f/2.2 ఎపర్చర్‌తో కూడిన 5 ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరా, f/ 2.4 ఎపర్చరుతో కూడిన 5 ఎంపి మాక్రో లెన్స్ కెమెరా, f / 2.2 ఎపర్చర్‌తో కూడిన  32MP సెల్ఫీ షూటర్ కెమెరాలను అందించారు. ఇది 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. అంతేకాకా, మైక్రోఎస్డీ కార్డు సహాయంతో దీని స్టోరేజ్ ను  1 టిబి వరకు పొడిగించుకోవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. దీనిలో 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్ వి 5.0, GPS/ A-GPS, NFC, USB Type-C, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి వాటిని అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఫీచర్లను కూడా చేర్చింది.
Published by:Sambasiva Reddy
First published:

అగ్ర కథనాలు