• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • SAMSUNG GALAXY F62 REVIEW AND THE DETAILS OF ITS OVERALL PERFORMANCE SSR

Samsung Galaxy F62: ఫ్లిప్‌కార్ట్‌లో ఇవాళ విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62 కొనొచ్చా? లేదా? దీంతో మీకు ఫుల్ క్లారిటీ పక్కా..!

Samsung Galaxy F62: ఫ్లిప్‌కార్ట్‌లో ఇవాళ విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62 కొనొచ్చా? లేదా? దీంతో మీకు ఫుల్ క్లారిటీ పక్కా..!

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ దూకుడు పెంచింది. ఇటీవల వరుసగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరిస్తూ స్పీడ్ పెంచిన ఈ దక్షిణ కొరియా కంపెనీ తాజాగా గెలాక్సీ సిరీస్‌లో ఒక కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఈతరం యువత మెచ్చే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62...

  • Share this:
    స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ దూకుడు పెంచింది. ఇటీవల వరుసగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరిస్తూ స్పీడ్ పెంచిన ఈ దక్షిణ కొరియా కంపెనీ తాజాగా గెలాక్సీ సిరీస్‌లో ఒక కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఈతరం యువత మెచ్చే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62 విడుదలైంది. ఇండియాలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ మోడల్‌పై సేల్స్ మొదలయ్యాయి. ఈ మధ్య గత కొద్దిరోజులుగా టెక్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న ఎఫ్ 62 మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ మోడల్ ఫీచర్లు లీకైనప్పటి నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎం51 మోడల్‌కు స్వల్ప మార్పులు చేసి ఈ మోడల్‌ను తీసుకొచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంలో కొంత నిజం ఉంది.

    ఎఫ్ 62 మోడల్‌లో ఎగ్జినోస్ 9825 అప్‌గ్రేడెడ్ చిప్‌సెట్‌ను అమర్చారు. అయితే.. ఈ ప్రాసెసర్ కొత్తదేమీ కాదు. శాంసంగ్ నోట్ 10, నోట్ 10ప్లస్ స్మార్ట్‌ఫోన్లు ఎగ్జినోస్ 9825 ప్రాసెసర్‌తోనే పనిచేస్తాయి. అయితే.. ఈ ప్రాసెసర్ కచ్చితంగా కొంత మెరుగైన పనితీరునే కనబరుస్తుందని చెప్పాలి. ఈ ఎగ్జినోస్ 9825 ప్రాసెసర్ బ్యాటరీ ఓవర్‌హీట్ అవ్వకుండా నియంత్రించి.. బ్యాటరీ సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపకరిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

    ఎమ్ 51 మోడల్‌తో పోల్చితే ఎఫ్62 డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఇక చాలామంది స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. ఈ విషయంలో ఎఫ్62 ముందు వరుసలో ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్ కావడం విశేషం. అయితే.. బ్యాటరీ ఫర్ఫామెన్స్ విషయంలో ఎఫ్62 కంటే ఎం51 కొంత మెరుగైన ఫోన్‌గా టెక్ నిపుణులు చెబుతున్న మాట. స్మార్ట్‌ఫోన్‌ను అదేపనిగా వినియోగించి.. 8 గంటల పాటు స్క్రీన్ ఆన్ చేసి ఉంచితే.. ఎఫ్ 62 8 గంటల పాటు పనిచేయగా, ఎమ్ 51 స్మార్ట్‌ఫోన్ 9 గంటల పాటు పనిచేసినట్లు ఓ రివ్యూలో తేలింది.

    అయితే.. మామూలుగా స్మార్ట్‌ఫోన్ వినియోగించేవారికి ఎఫ్ 62 కచ్చితంగా ఆశించిన బ్యాటరీ ఫర్పామెన్స్‌ను ఇస్తుందనడంలో సందేహమే లేదు. ఎఫ్ 62 స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జింగ్ అవ్వాలంటే ఒక గంట 53 నిమిషాలు పడుతుంది. అయితే.. ఈ ఫోన్‌కు ఉన్న ఒకేఒక్క లోటు 5జీ సపోర్ట్ చేయకపోవడం. ఈ ధరలో ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో కొన్ని 5జీ ఫోన్లను విడుదల చేశాయి. అయితే.. భారత్‌లో 5జీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి 4జీ వేగంతో ఇంటర్నెట్ వినియోగించేవారికి శాంసంగ్ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్ కచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

    ఇక.. కాల్ ఫర్ఫామెన్స్ విషయానికొస్తే.. ఎఫ్ 62 ఆ విషయంలో మెరుగ్గానే ఉంది. బెటర్ కాల్ ఎక్స్‌పీరియన్స్ కోసం చెప్పుకోదగ్గ ఇయర్‌పీస్‌నే ఎఫ్ 62లో అమర్చారు. ఇక డిస్‌ప్లే గురించి చెప్పుకోవాల్సి వస్తే.. గెలాక్సీ ఎఫ్ 62 అమోల్డ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ ఎం51ను కూడా ఇదే డిస్‌ప్లేతో శాంసంగ్ అందించింది. ప్యానల్ క్వాలిటీ కూడా ఎఫ్ 62లో మెరుగ్గానే ఉంది. ఇక.. కెమరా విషయానికొస్తే.. శాంసంగ్ ఎఫ్ 62 కెమెరాకు, శాంసంగ్ ఎం51 కెమెరాకు పెద్ద తేడా లేదు. సింగిల్ టేక్ ఆప్షన్‌తో పాటు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్, 5ఎంపీ మ్యాక్రో, 5 ఎంపీ డెప్త్ కెమరాతో ఎఫ్ 62ను డిజైన్ చేశారు.

    గెలాక్సీ ఎమ్51, గెలాక్సీ ఎఫ్ 62ను ప్రభావవంతమైన కెమెరాతో శాంసంగ్ అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు తీయాల్సొస్తే.. క్వాలిటీ విషయంలో ఎఫ్62 మంచి ఎంపిక అని చెప్పకతప్పదు. శాంసంగ్ గెలాక్సీ ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్‌వేర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ బడ్జెట్ ధరలో కచ్చితంగా ఎఫ్62 బెస్ట్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్‌తోనే ముందుకొచ్చింది. అయితే.. రూ. 25 వేల బడ్జెట్ లోపు బెస్ట్ ‌స్మార్ట్‌ఫోన్ల జాబితాలో గెలాక్సీ ఎఫ్ 62 కూడా నిలుస్తుందని చెప్పొచ్చు. ఈ బడ్జెట్‌లో శాంసంగ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునేవారికి గెలాక్సీ ఎం51 కంటే గెలాక్సీ ఎఫ్ 62 బెస్ట్ ఆప్షన్ అని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు