Home /News /technology /

SAMSUNG GALAXY F42 5G LAUNCHED WITH MEDIATEK DIMENSITY 700 PROCESSOR AND 64MP TRIPLE CAMERA KNOW PRICE AND SPECIFICATIONS SS

Samsung Galaxy F42 5G: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర రూ.20,000 లోపే

Samsung Galaxy F42 5G: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర రూ.20,000 లోపే
(image: Samsung India)

Samsung Galaxy F42 5G: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర రూ.20,000 లోపే (image: Samsung India)

Samsung Galaxy F42 5G | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రూ.20,000 లోపు బడ్జెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ (Samsung Galaxy F42 5G) ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    ఫెస్టివల్ సీజన్ కావడంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వరుసగా స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేస్తున్నాయి. సాంసంగ్ కూడా పోటాపోటీగా కొత్త మొబైల్స్ లాంఛ్ చేస్తోంది. మంగళవారం ఎం సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ (Samsung Galaxy M52 5G) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఎఫ్ సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ (Samsung Galaxy F42 5G) మోడల్‌ను పరిచయం చేసింది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ ఐకూ జెడ్3, మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్, రియల్‌మీ ఎక్స్7 5జీ లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

    Google Pixel 4A: ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,499 విలువైన స్మార్ట్ స్పీకర్ ఒక్క రూపాయికే... మరో ఆఫర్ కూడా


    సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఇంట్రడక్టరీ ఆఫర్‌ను సాంసంగ్ ప్రకటించింది. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఆఫర్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.19,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అక్టోబర్ 3న సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో, రీటైలర్ల దగ్గర ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనొచ్చు.

    Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ముందే మొదలైన స్మార్ట్‌ఫోన్ సేల్... ఈ 15 మొబైల్స్‌పై డిస్కౌంట్

    సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలున్నాయి. రియర్ కెమెరాలో హైపర్‌ల్యాప్స్, స్లో మోషన్, ఫుడ్ మోడ్, నైట్ మోడ్, పనోరమా, ప్రో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

    సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మ్యాటీ బ్లాక్, మ్యాటీ ఆక్వా కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Amazon Great Indian Festival Sale, Mobile News, Mobiles, Samsung, Smartphone

    తదుపరి వార్తలు