సాంసంగ్ నుంచి గెలాక్సీ సిరీస్‌లో మరో 5జీ మొబైల్ వచ్చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ (Samsung Galaxy F23 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 120Hz డిస్ప్లే, 50మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. గతేడాది సాంసంగ్ రిలీజ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 (Samsung Galaxy F22) అప్‌గ్రేడ్ మోడల్‌గా సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.17,499. ఇప్పటికే ఈ బడ్జెట్లో ఉన్న రెడ్మీ నోట్ 11టీ 5జీ, మోటోరోలా జీ71, రియల్మీ 9 ప్రో లాంటి మోడల్స్‌కు సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ గట్టి పోటీ ఇవ్వనుంది.
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499. అయితే సాంసంగ్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ప్రకటించింది. ఇంట్రడక్టరీ ఆఫర్లో భాగంగా సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై వచ్చే రూ.1,000 క్యాష్‌బ్యాక్‌తో ఈ ఆఫర్ లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ మార్చి 16న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్సైట్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు.
Realme C35: ఐఫోన్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... ధర ఎంతంటే
The #Frevolution is here.
Get your hands on the #GalaxyF23 5G that comes with the first ever* Snapdragon 750G, Voice Focus and Power Cool technology. Buy it at an introductory price of ₹ 14999* from 16th March, 12 noon onwards. pic.twitter.com/XmPe1Ihc2k
— Samsung India (@SamsungIndia) March 8, 2022
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ షావోమీ ఎంఐ 10ఐ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, సాంసంగ్ గెలాక్సీ ఎం42 స్మార్ట్ఫోన్లలో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 6జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ Samsung JN1 ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అయితే ఛార్జర్ బాక్సులో లభించదు.
Smartphone Offer: రూ.25,990 విలువైన స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్లో రూ.10,000 లోపే
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్ఫోన్లోకనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో వాయిస్ ఫోకస్, ఆటో డేటా స్విచ్చింగ్, పవర్ కూల్ టెక్నాలజీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు. రెండేళ్ల ఓఎస్ అప్డేట్స్, మూడేళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయని సాంసంగ్ ప్రకటించింది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Samsung, Smartphone