Home /News /technology /

SAMSUNG GALAXY F22 LAUNCHED IN INDIA WITH MEDIATEK HELIO G80 PROCESSOR AND 6000MAH BATTERY KNOW PRICE AND SPECIFICATIONS SS

Samsung Galaxy F22: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 రిలీజ్... మొదటి సేల్‌లో రూ.1,000 తగ్గింపు

Samsung Galaxy F22: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 రిలీజ్... మొదటి సేల్‌లో రూ.1,000 తగ్గింపు
(image: Samsung India)

Samsung Galaxy F22: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 రిలీజ్... మొదటి సేల్‌లో రూ.1,000 తగ్గింపు (image: Samsung India)

Samsung Galaxy F22 | రూ.13,000 లోపు బడ్జెట్ సెగ్మెంట్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    సాంసంగ్ నుంచి ఇండియాలో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది సాంసంగ్. కాస్త తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కోరుకునేవారి కోసం సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 మోడల్‌ను రూపొందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్‌ను సాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో రిలీజ్ అయింది. 4జీబీ+64జీబీ ధర రూ.12,499 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.14,499. జూలై 13 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. ఇంట్రడక్టరీ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీపెయిడ్ ఆర్డర్‌పై రూ.1,000 తగ్గింపు పొందొచ్చు.

    Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగావకాశాలు... ఏడాదికి రూ.26.57 లక్షల వేతనం... రిజిస్టర్ చేయండి ఇలా

    Amazon Prime Subscription: 50 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోండి ఇలా

    సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరాలో హైపర్‌ల్యాప్స్, స్లో మోషన్, ఫుడ్ మోడ్, ప్రో మోడ్, ఏఆర్ జోన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    Amazon Price Error: రూ.96,700 విలువైన ఇన్వర్టర్ ఏసీ రూ.5900 ధరకే... ప్రైస్ ఎర్రర్‌తో లాభపడిన కస్టమర్లు

    Vivo V21e 5G: రూ.24,990 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.4,140 ధరకే కొనండి ఇలా


    సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో మాత్రం 15వాట్ ఛార్జర్ మాత్రమే లభిస్తుంది. 25వాట్ ఛార్జర్ కావాలంటే వేరుగా కొనాల్సి ఉంటుంది. 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ వర్షన్ 5, ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 + వన్ యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సాంసంగ్ పే మినీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 203 గ్రాములు. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్‌ను డెనిమ్ బ్లూ, డెనిమ్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.

    రూ.13,000 లోపు బడ్జెట్‌లో రెడ్‌మీ నోట్ 10, నోకియా జీ20, మోటో జీ9 పవర్, పోకో ఎం3 లాంటి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ మొబైల్స్‌కు సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్ పోటీ ఇవ్వనుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile, Mobile News, Mobiles, Samsung, Smartphone, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు