హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung Galaxy F14 5G: సాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ ఈరోజే... 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మరెన్నో ఫీచర్స్

Samsung Galaxy F14 5G: సాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ ఈరోజే... 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మరెన్నో ఫీచర్స్

Samsung Galaxy F14 5G: సాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ ఈరోజే... 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మరెన్నో ఫీచర్స్
(image: Samsung India)

Samsung Galaxy F14 5G: సాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ ఈరోజే... 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మరెన్నో ఫీచర్స్ (image: Samsung India)

Samsung Galaxy F14 5G | సాంసంగ్ ఇటీవల రిలీజ్ చేసిన సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) సేల్ ఈరోజే ప్రారంభం కానుంది. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా లాంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

సాంసంగ్ ఇండియా ఇటీవల సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) లాంఛ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ (Samsung Galaxy F14 5G) మొబైల్‌ను తీసుకొచ్చింది. ఇందులో భారీ ఫీచర్స్ ఉన్నాయి. సాంసంగ్ సొంత ప్రాసెసర్ ఇందులో ఉంది. 6,000mAh కెపాసిటీతో భారీ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ సేల్ మార్చి 30 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఈ మొబైల్‌ను రిలీజ్ చేసింది సాంసంగ్. మరి సాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

సాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ధర

సాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,990 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,990. ఇవి ఇంట్రడక్టరీ ధరలు మాత్రమే. త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ , సాంసంగ్ ఇండియా ప్లాట్‌ఫామ్స్‌లో కొనొచ్చు. ఓఎంజీ బ్లాక్, గోట్ గ్రీన్, బే పర్పుల్ కలర్స్‌లో కొనొచ్చు.

Moto G13: రూ.10 వేల లోపు మోటో జీ13 రిలీజ్... 4GB ర్యామ్, 128GB స్టోరేజ్, 50MP కెమెరా, మరెన్నో ఫీచర్స్

సాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్పెసిఫికేషన్స్

సాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది. సాంసంగ్ ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ సాంసంగ్ గెలాక్సీ ఏ14, సాంసంగ్ గెలాక్సీ ఎం14 మొబైల్స్‌లో కూడా ఉంది. ఆండ్రాయిడ్ 13 + వన్‌యూఐ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 6జీబీ వరకు ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు.

iPhone 14: భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర... తొలిసారి ఇంత తక్కువ రేటుకే

సాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రోసెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 6,000mAh భారీ బ్యాటరీ ఉండగా, 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, బ్లూటూత్, వైఫై, 5జీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. స్పష్టమైన వాయిస్ కాల్స్, కాల్ బ్యాక్‌గ్రౌండ్, స్ప్లిట్ వ్యూతో మల్టీ టాస్కింగ్, ఫోన్‌ల మధ్య వేగంగా షేరింగ్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ డాష్‌బోర్డ్, AI వాయిస్ బూస్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

First published:

Tags: 5G Smartphone, Samsung, Smartphone

ఉత్తమ కథలు