సాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో లాంఛ్ చేసిన స్మార్ట్‌ఫోన్లు బాగా పాపులర్ అయ్యాయి. సాంసంగ్ ఎఫ్ సిరీస్‌లో మరో మొబైల్ లాంఛ్ చేయబోతోంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేయబోతోంది. ఇందులో 6,000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్, 50MP కెమెరా లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. జూన్ 22న సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 లాంఛ్ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌లో టీజర్ కనిపించింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ అధికారికంగా తెలిశాయి. ఇప్పటికే యూరప్ మార్కెట్‌లో లాంఛ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం13 మోడల్‌నే రీబ్రాండ్ చేసి ఇండియాలో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 పేరుతో రిలీజ్ చేయొచ్చన్న వార్తలొస్తున్నాయి.
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందన్న స్పష్టత లేదు. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 బడ్జెట్ ధరలోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. రూ.15,000 లోపు బడ్జెట్‌లో (Smartphone Under Rs 15000) ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవుతుందన్న వార్తలొస్తున్నాయి. స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. సాంసంగ్‌కు చెందిన ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ సాంసంగ్ గెలాక్సీ ఎం12, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ లాంటి మోడల్స్‌లో ఉంది.
OnePlus Smart TV: రూ.20,000 లోపే 43 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ... ఆఫర్ వివరాలివే
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 8జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2మెగాపిక్సెల్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులో లభిస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ఇందులో ఆటో డేటా స్విచ్చింగ్ ఫీచర్ ఉంటుంది. మూడు కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.
Loan in 30 seconds: వాట్సప్‌లో Hi అని టైప్ చేస్తే 30 సెకండ్లలో లోన్
ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ధర రూ.9,499. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే, ఎక్సినోస్ 850 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone