సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో మరో రెండు స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది కంపెనీ. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 స్మార్ట్‌ఫోన్‌లో 90Hz డిస్ప్లే, ఎక్సినోస్ 850 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇక సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ మోడల్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 ప్రారంభ ధర రూ.9,999. ఇది 4జీబీ+64జీబీ వేరియంట్ ధర. ఇక 4జీబీ+128జీబీ ధర రూ.10,999. ఇది ఇంట్రడక్టరీ ధర మాత్రమే. త్వరలో ధర పెరగొచ్చు. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొంటే రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 సేల్ ఏప్రిల్ 12 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో సేల్ మొదలవుతుంది. ఇక సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. ఏప్రిల్ 9 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది.
Jio Cricket plans: ఐపీఎల్ స్పెషల్... జియో అందిస్తున్న క్రికెట్ ప్లాన్స్ ఇవే
Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.10,999 ధరకే సొంతం చేసుకోండి... ఈ ఆఫర్ వారికి మాత్రమే
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ వీ 90Hz డిస్ప్లే
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: సాంసంగ్ ఎక్సినోస్ 850
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ISOCELL GM2 ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6000ఎంఏహెచ్ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్
కలర్స్: సెలెస్టియల్ బ్లాక్, స్కై బ్లూ, సీ గ్రీన్
ధర:
4జీబీ+64జీబీ- రూ.9,999
4జీబీ+128జీబీ- రూ.10,999
JioFiber Free Trial: ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా? జియోఫైబర్ ఫ్రీ ట్రయల్ ట్రై చేయండి
POCO X3 Price Cut: కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది
The hype is growing strong! The #FullOnFab #SamsungF12 just hit the stores and we can’t keep calm about it. This brand new phone is all-set to obliterate the competition with its True 48MP Quad Camera, smooth 90Hz Display, best-in-class and a 6000mAh battery! pic.twitter.com/ZfM2rVNKWE
— Samsung India (@SamsungIndia) April 5, 2021
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ వీ డిస్ప్లే
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + వన్‌యూఐ కోర్
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, వైట్, బ్లూ
ధర:
3జీబీ+32జీబీ- రూ.8,999
4జీబీ+64జీబీ- రూ.9,999
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile, Mobile News, Mobiles, Samsung, Smartphone, Smartphones